స్టాలిన్ నివాసానికి రజనీకాంత్.. తమిళనాట మారుతున్న లెక్కలు !!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారాయి. ముఖ్యంగా Rajinikanth, మాజీ ముఖ్యమంత్రి M. K. Stalinను ఆయన నివాసంలో కలవడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం పరామర్శనా? లేక భవిష్యత్ రాజకీయ సమీకరణాల సంకేతమా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో సినీ నటుడు Vijay నేతృత్వంలోని Tamilaga Vettri Kazhagam (టీవీకే) సంచలన విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు, దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను ఆధిపత్యం చెలాయిస్తున్న Dravida Munnetra Kazhagam (డీఎంకే) కేవలం 59 సీట్లకు పరిమితమవడం పెద్ద షాక్‌గా మారింది. ఈ ఫలితాలు రాష్ట్రంలో ద్రవిడ రాజకీయాలపై కొత్త చర్చలకు దారితీశాయి.

అంతే కాకుండా స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలోనే ఓటమి పాలవడం. టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 8,700 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం రాజకీయంగా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంతో డీఎంకే భవిష్యత్ నాయకత్వంపై కూడా చర్చ మొదలైంది. పార్టీ బాధ్యతలను ఆయన కుమారుడు Udhayanidhi Stalin చేపట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనఏ రజనీకాంత్ భేటీ కావడం మరింత ప్రాధాన్యత కలిగించే అంశంగా మారింది. 1990లలో ఆయన డీఎంకే కూటమికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లో రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకోవడం, తర్వాత ఆరోగ్య కారణాలతో వెనక్కి తగ్గడం జరిగాయి. ఇటీవల విజయ్ విజయం తర్వాత కూడా ఆయన సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేయడం గమనార్హం. దీంతో భవిష్యత్‌లో ఆయన రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేగంగా కదులుతోంది. మెజారిటీకి కావాల్సిన 118 సీట్లలో ఇంకా కొద్ది సీట్లు తక్కువగా ఉండటంతో.. కాంగ్రెస్ నేతల మద్దతుతో గవర్నర్ ని కలిశారు. మొత్తానికి ఒకవైపు డీఎంకేకు ఎదురుదెబ్బ, మరోవైపు విజయ్ ఎదుగుదల.. ఈ మధ్యలో రజనీకాంత్ వంటి దిగ్గజం కదలికలు-ఇవన్నీ కలిపి తమిళనాడు రాజకీయాలను కొత్త మలుపు తిప్పుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సమీకరణాలు ఎలా మారుతాయో చూడటం ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications