TVK రహస్య భేటీ: దళపతి దావత్, విదేశాలకు విజయ్?

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అంకాన్ని మొదలుపెట్టిన నటుడు విజయ్, తన పార్టీ అభ్యర్థుల కోసం పనయూర్‌లో భారీ విందును ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 29న ముగిసిన అసెంబ్లీ పోలింగ్‌లో హోరాహోరీగా పోరాడిన 233 మంది అభ్యర్థులకు ఈ 'విందు' ద్వారా కృతజ్ఞతలు తెలపనున్నారు. ఫలితం ఎలా ఉన్నా, కలిసికట్టుగా ముందుకు సాగాలనే సంకేతాన్ని పంపడమే విజయ్ ప్రధాన ఉద్దేశం.

ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు క్యూ కట్టారు. గత ఎన్నికలతో పోలిస్తే 25 లక్షల ఓట్లు అధికంగా, మొత్తంగా 85.15% ఓటింగ్ నమోదైంది. ఈ భారీ పోలింగ్ ఎవరికి అనుకూలంగా ఉందనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు విజయ్ నేతృత్వంలోని టీవీకే గట్టి సవాలు విసిరింది. నివేదికల ప్రకారం, మహిళా ఓటర్లు ఈసారి విజయ్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.

Thalapathy Vijay s Royal Feast for TVK Candidates Preparing the Party Cadre for Tamil Nadu Results

దక్షిణాన పుంజుకున్న పార్టీ.. చెన్నైలో గట్టి పోటీ!

అన్నాడీఎంకే పట్టు కోల్పోయిన దక్షిణ జిల్లాల్లో టీవీకే అనూహ్యంగా పుంజుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజధాని చెన్నైలోని పలు నియోజకవర్గాల్లో సైతం విజయ్ పార్టీ రెండో స్థానంలో నిలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేస్తున్నాయి. ఈ విందు ద్వారా ఎన్నికల్లో కష్టపడిన జిల్లా నిర్వాహకులను, అభ్యర్థులను స్వయంగా విజయ్ అభినందించనున్నారు.

అధికారం దక్కకపోయినా.. ప్లాన్-బి సిద్ధం!

విజయ్ కేవలం గెలుపుపైనే ఆశలు పెట్టుకోకుండా, భవిష్యత్ రాజకీయాలపై స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ఒకవేళ అధికారానికి దూరం అయితే, కేవలం విమర్శలకే పరిమితం కాకుండా.. ప్రజా సమస్యలపై పోరాటం, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటడం వంటి అంశాలపై శ్రేణులను సంసిద్ధం చేస్తున్నారు. సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ 'రాజ విందు' వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్.

విదేశీ పర్యటన?

ఎన్నికల హడావుడి ముగియడంతో విజయ్ కొంత కాలం విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఫలితాల తర్వాతే ఆయన పర్యటనపై స్పష్టత రానుంది. ఏదేమైనా, తమిళ రాజకీయాల్లో 'దళపతి' వేస్తున్న అడుగులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+