సొంత వార్డులోనూ ఓడిపోయిన మమతా బెనర్జీ..! ఈసీ మరో షాకింగ్..!

పశ్చిమబెంగాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. 294 సీట్ల అసెంబ్లీలో కేవలం 80 సీట్లకు పరిమితమైంది. మమతా బెనర్జీ (Mamata Banerjee)ను ఆమె సొంత గడ్డపైనే ఓడించాలన్న అమిత్ షా పిలుపును అక్షరాలా ఆచరణలో పెట్టిన సువేందు అధికారి (Suvendu Adhikari).. అన్నట్లుగానే భవానీపూర్ లో ఆమెను చిత్తు చేశారు. అయితే అంతకు మించిన షాకింగ్ విషయాన్ని ఎన్నికల సంఘం ఇప్పుడు బయటపెట్టింది.

Revanth Reddy: మా నెక్ట్స్ సువేందు రేవంత్ రెడ్డే ? బీజేపీ ఎంపీ షాకింగ్ జోస్యం..!
Revanth Reddy: మా నెక్ట్స్ సువేందు రేవంత్ రెడ్డే ? బీజేపీ ఎంపీ షాకింగ్ జోస్యం..!

ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన బూత్ వారీ ఫలితాల ప్రకారం.. సువేందు అధికారి కోల్‌కతాలోని భవానిపూర్ నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించడమే కాకుండా, ఆమె నివసించే వార్డులోనే ఆమెను ఓడించారు. భవానీపూర్ నియోజకవర్గంలోని 267 బూత్‌లలో 207 బూత్‌లలో సువేందు అధికారి ఆధిక్యం సాధించడమే కాకుండా.. మమతా బెనర్జీ నివాసం ఉన్న కాళీఘాట్‌లోని వార్డ్ నెం.73లో సైతం ఆమెను ఓడించారు.

EC Data Reveals Mamata Banerjee Lost in Her Own Ward to Suvendu Adhikari
తృణమూల్ భారీ ప్రక్షాళన..! రెబెల్స్ కు మమత ఫుల్ క్లారిటీ..!
తృణమూల్ భారీ ప్రక్షాళన..! రెబెల్స్ కు మమత ఫుల్ క్లారిటీ..!

ఈ వార్డులో మమతా బెనర్జీకు 4,284 ఓట్లు రాగా.. సువేందు అధికారి 8,932 ఓట్లు సాధించారు. వాస్తవానికి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసానికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంతి ప్రాంతానికి చెందిన సువెందు అధికారికి.. దక్షిణ కోల్‌కతా నియోజకవర్గంలో ముందుగా ఎలాంటి రాజకీయ పునాది గానీ, సంస్థాగత ఉనికి గానీ లేదు. అయినప్పటికీ, ఆమె సొంత గడ్డపై ఆమెను ఓడిస్తానన్న అమిత్ షా వాగ్దానాన్ని అక్షరాలా నెరవేరుస్తూ, ఆయన ఆమె వార్డులో రెట్టింపు కంటే ఎక్కువ ఓట్లను సాధించారు. సువేందు 63 శాతం ఓట్ల వాటాను సాధించగా, మమతా బెనర్జీ కేవలం 30 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భవానీపూర్ లోని అనేక వార్డులలో మమతకు 50 ఓట్లు కూడా రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+