మేషరాశి, వృషభ రాశి జూన్ నెల జాతక ఫలం పూర్తి వివరాలు

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లో మేష రాశి, వృషభ రాశివారి జూన్ నెల జాతక ఫలం ఎలా ఉందో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఫలితాలు గ్రహాల కదలికల ఆధారంగా ఉంటాయి. వ్యక్తిగత జాతకంలోని గ్రహ బలాన్ని బట్టి ఈ ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

మేష రాశి

మేష రాశి వారికి జూన్ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నెల ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ద్వితీయార్థంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తోటి ఉద్యోగులతో లేదా పై అధికారులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు సంయమనం ముఖ్యం. జూన్ నెల ద్వితీయార్థంలో గ్రహాల అనుకూలత వల్ల పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఐటీ, మార్కెటింగ్ రంగాల వారికి విదేశీ అవకాశాలు వచ్చే సూచనలున్నాయి. ఆదాయ మార్గాలు బాగున్నప్పటికీ, ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. అనవసరపు వస్తువులపై పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

Horoscope Complete Details for these two signs Aries and Taurus for the Month of June

ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వద్దు, తిరిగి రావడం కష్టమవుతాయి. షేర్ మార్కెట్ పెట్టుబడుల్లో నిపుణుల సలహా తీసుకోండి. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో వాదనలకు దూరంగా ఉండాలి. తోబుట్టువుల నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. నెల చివర్లో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు వెళతారు. మాపసిక ఒత్తిడి, తలనొప్పి లేదా కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. సరైన విశ్రాంతి, యోగా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పఠించడం లేదా సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి జూన్ నెల అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. బుధ, శుక్రుల అనుకూల సంచారం వల్ల అన్ని రంగాలలో విజయం, ధన లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు ఉండే అవకాశం బలంగా ఉంది. మీ కష్టానికి పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. పార్ట్‌నర్‌షిప్ వ్యాపారాలు చేసేవారికి లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా ఈ నెల మీకు 'గోల్డెన్ పీరియడ్' లాంటిది. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేయడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి.

ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
అవివాహితులకు వివాహం జరిగే బలమైన సూచనలు ఉన్నాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఈ నెల మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. పాత అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసికంగా, శారీరకంగా ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. శుక్రవారం రోజున లక్ష్మీ దేవి పూజ చేయడం, పేదలకు పాలు లేదా తెల్లటి మిఠాయిలను దానం చేయడం వల్ల అదృష్టం మరింత పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+