3 రాష్ట్రాల ఫలితాలకు ఒకటే కారణం..! అనలిస్ట్ పార్థా దాస్ షాకింగ్ విశ్లేషణ..!
తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. ఇందులో తమిళనాడులో విజయ్ కొత్త పార్టీ టీవీకే ప్రభంజనం సృష్టించగా.. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ, దాని మిత్రపక్షాలు, కేరళలో కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ విజయం సాధించాయి. అయితే ఇందులో మూడు రాష్ట్రాల్లో పార్టీల విజయాల వెనుక ఒకటే కారణం ఉందంటే నమ్మగలరా ? కానీ అదే నిజం అంటున్నారు ఎన్నికల విశ్లేషకుడు పార్థా దాస్.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెనుక ఒకటే కారణం ఉందని ఎన్నికల విశ్లేషకుడు, సెఫాలజిస్ట్ పార్థా దాస్ (Partha Das) వెల్లడించారు. గత ఎన్నికల్లో నేపాల్ ఏ విధంగా ఓటు వేసిందో..అదే తరహాలో ఇప్పుడు తమిళనాడు కూడా ఓటు వేసిందని ఆయన తెలిపారు. యువత తీవ్ర నిరాశలో ఉన్నారని, వారికి ఉద్యోగాలు కావాలని ఆయన తెలిపారు. ఇది మనందరికీ ఒక హెచ్చరిక..అని పార్ధాదాస్ అన్ని పార్టీలను ఉద్దేశించి సూచన చేశారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో యువత (youth) నిరాశ స్పష్టంగా కనిపిస్తోందని పార్థా దాస్ తెలిపారు.

The way Nepal voted in the last election..
— Partha Das (@partha2019LS) May 4, 2026
Tamil nadu also voted in the same manner..
Youths are super frustrated..
They need job..
It's a wake up call for all of us..
The frustration of youths clearly visible in Tamilnadu, Kerala and West Bengal Election results..
తమిళనాడులో విజయ్ కొత్త పార్టీ టీవీకేవైపు యువత మొగ్గు చూపినట్లు ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్, సర్వేలు తేల్చేయగా.. ఇవాళ ఫలితాలు కూడా అదే ట్రెండ్ ను నిర్దారించాయి. అలాగే పశ్చిమ బెంగాల్లోనూ నిరుద్యోగం యువతపై తీవ్రంగా ప్రభావం చూపిందని, మమత సర్కార్ ఉద్యోగాల కల్పనలో విఫలమైందనే విశ్లేషణలు ఇప్పటికే ఉన్నాయి. అలాగే విద్యావంతులు ఎక్కువగా ఉండే కేరళలో సైతం నిరుద్యోగ స్థాయి పెరుగుతుండటం వల్లే ప్రభుత్వ మార్పుకు అక్కడి యువత ఓటేశారని ఎన్నికల ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి.














Click it and Unblock the Notifications