అవమానించారు.. ఎగతాళి చేశారు: విజయం తర్వాత విజయ్ ఎమోషనల్ ట్వీట్
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో టీవీకే పార్టీ సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అధికార డీఎంకే 73 స్థానాలకు పరిమితం అయింది. అన్నాడీఎంకే 53 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ శాసనసభాపక్షనేతగా విజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయ్ ను శాసనసభాపక్ష నేతగా టీవీకే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. విజయ్ మే 7 న తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఇక విజయ్ తో కలిసి వచ్చేందుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు టీవీకే పార్టీకి మద్దతు తెలిపింది.
అయితే తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయం తర్వాత విజయ్ తొలిసారిగా ట్వీట్ చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి అవమానించి.. ఎగతాళి చేసినవారే ఎక్కువ అని ఎమోషనల్ అయ్యారు. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని దాటుకుంటూ ముందుకొచ్చాం. ఎవరిపైనా ఆధారపడకుండా ప్రజల్ని మాత్రమే నమ్మి ఎన్నికల్లో ధైర్యంగా నిలబడి గెలిచాం. తమిళనాడు ప్రజలు మనల్ని ఎప్పుడూ గుండెల్లో పెట్టుకున్నారు. మనపై అపారమైన ప్రేమను కురిపిస్తూ ఘన విజయాన్ని అందించారు.

ఈ ఎన్నికల్లో గెలిచింది కేవలం టీవీకే పార్టీ మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యం కూడా.. మార్పు కోసం పుట్టిన ఒక గొప్ప రాజకీయ శక్తిగా టీవీకే పార్టీ ఎదిగిందని ఈ విజయం ద్వారా బలంగా నిరూపితమైంది. ఎప్పటికీ సాధ్యం కాదనుకున్న రాజకీయ మార్పును సుసాధ్యం చేసిన నా తమిళనాడు ప్రజలకు జీవితకాలం రుణపడి ఉంటాను. అలాగే మనపార్టీ కార్యకర్తలు, నిర్వాహకులు, వర్చువల్ వారియర్స్ .. ఇలా ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. అని టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎమోషనల్ అయ్యారు.
என் நெஞ்சில் குடியிருக்கும் அனைவருக்கும் வணக்கம்.
— TVK Vijay (@TVKVijayHQ) May 5, 2026
கட்சி ஆரம்பித்ததில் இருந்தே நம்மை ஏளனமாகப் பார்த்தவர்களும் பேசியவர்களுமே அதிகம். அரசியலில் இது இயல்பே என்றுதான் நாமும் அதைக் கடந்து வந்தோம். எவரையும் சாராமல், மக்களை மட்டுமே நம்பி, தேர்தல் களத்திலும் தில்லாக நின்றோம்.
நடுநிலை…
అంతకుముందు తమిళనాడు ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలిసారి విజయ్ ట్వీట్ చేశారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీకి రిప్లై ఇచ్చారు. " శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. ప్రజల శ్రేయస్సే మా ఏకైక లక్ష్యం. రాజకీయాలకు అతీతంగా తమిళనాడు ప్రజల సంక్షేమంపై మనం దృష్టిసారించాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ మద్దతును ఆశిస్తున్నాం" అని విజయ్ పేర్కొన్నారు. మరోవైపు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా విజయ్ థాంక్స్ చెప్పారు.












Click it and Unblock the Notifications