విజయ్ "విజయం" తథ్యం..? తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు..!
మరికొద్ది గంటల్లో తమిళనాడు భవితవ్యం తేలనుంది. ఏప్రిల్ 23 న తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మే 4 కౌంటింగ్ నేపథ్యంలో దేశం చూపు ఇప్పుడు తమిళనాడు వైపు ఉంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే అలాగే విజయ్ దళపతి టీవీకే పార్టీ చూట్టూనే తమిళనాడు రాజకీయాలు తిరిగాయి. అయితే ఇప్పుడు అందరి కళ్లు దళపతి విజయ్ టీవీకే పార్టీపైనే ఉన్నాయి. తొలిసారి తమిళనాడు ఎన్నికల బరిలో దిగిన విజయ్ కు రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు, మహిళలు బ్రహ్మరథం పట్టినట్లు తెలుస్తోంది. అలాగే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి తమిళనాడులో 85 శాతానికి పైగా పోలింగ్ నమోదుకావడం ఇదే తొలిసారి. దాంతో కింగ్ అవుతారా..? లేక కింగ్ మేకర్ అవుతారా..? అంటూ ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
దీనికితోడు విజయ్ టీవీకే పార్టీ ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని యాక్సెస్ మై ఇండియా సర్వే ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సర్వే గతంలో చేపట్టిన అనేక అంచనాలు నిజం అయ్యాయి. దాంతో ఈసారి తమిళనాడు విజయ్ దే అని అంతా భావిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీకి 98 నుంచి 120 స్థానాలు వస్తాయని యాక్సెస్ మై ఇండియా సర్వే స్పష్టం చేసింది. అలాగే అధికార డీఎంకే పార్టీకి 92 నుంచి 110 స్థానాలు.. ఇక అన్నాడీఎంకే పార్టీకి 22 నుంచి 32 స్థానాలు మాత్రమే దక్కుతాయని అంచనా వేసింది. ఇదే కానీ నిజం అయితే తమిళనాడులో విజయ్ శకం ప్రారంభం అయినట్లు చెప్పొచ్చు.

మరోవైపు విజయ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మే 4 ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. దాంతో విజయ్ ఇంటి వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇదిలాఉండగా స్టార్ హీరోయిన్ త్రిష ఉన్నట్టుండి తిరుపతి బయల్దేరారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా గ్రామ్ స్టేటస్ ద్వారా బయటపెట్టారు. మే 4 ఆమె పుట్టినరోజు కాబట్టి తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి ఆశీస్సుల కోసం ఆమె తిరుపతి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రేపు విజయ్ రాజకీయ భవితవ్యం కూడా తేలనున్న నేపథ్యంలో ఆమె విజయ్ విజయం కోసం ప్రత్యేక పూజలు చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications