కేతు గ్రహణ యోగంతో త్వరలో ఈ రాశులవారికి ఆకస్మిక కష్టాలు, నష్టాలు!

జ్యోతిష్యశాస్త్రంలో కేతు, రాహువులను నీడ గ్రహాలు, చెడు చేసే గ్రహాలు అంటారు. వీటి కదలికలు పన్నెండు రాశులపై ప్రభావం చూపుతాయి. త్వరలో కేతువు, చంద్ర గ్రహాలు సింహ రాశిలో కలిసి సంచరిస్తాయి. ఈ కలయిక వల్ల 'గ్రహణ యోగం' ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి ఊహించని సమస్యలను తీసుకొస్తుంది.మే 22న సింహరాశిలో కేతువు-చంద్రుడి కలయిక వల్ల కింది రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి

సింహ రాశి వారికి మే 22 నుండి రుణ బాధలు అధికం అవుతాయి. సొంత రాశిలో కేతు, చంద్ర గ్రహాల కలయిక వల్ల వీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఎదుటి వారితో మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బందులు వస్తాయి.

ketu Grahan Yoga These 4 Zodiac Signs Face Tough Times Due To Ketu Chandra Conjunction on may 22nd

వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారికి కేతు గ్రహణ యోగం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు రావొచ్చు. కుటుంబ సమస్యలు అధికమై, అనారోగ్య బాధలు వేధిస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. రోగాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మకరరాశి

మకర రాశి వారికి కేతు గ్రహణ యోగం కారణంగా ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా చవిచూడాల్సి వస్తుంది. కుటుంబ కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఉద్యోగులు తమ జాబ్ కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

శని రేవతి నక్షత్ర సంచారం: ఈ 3 రాశుల వారికి మహర్దశ, అదృష్టం వరించనుంది
శని రేవతి నక్షత్ర సంచారం: ఈ 3 రాశుల వారికి మహర్దశ, అదృష్టం వరించనుంది

మీనరాశి

మీన రాశి వారు కేతు గ్రహణ యోగం వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలు ఎక్కువవడంతో పాటు, ఆరోగ్యం విషయంలోనూ ఇబ్బందులు ఉంటాయి. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఏ పని చేసినా ఆచి తూచి నిర్ణయం తీసుకోవటం మంచిది.

గమనిక: ఈ ఫలితాలు ప్రతి వ్యక్తి జన్మ నక్షత్రం, దశ, కుండలి స్థితి ఆధారంగా మారుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది సాధారణ విశ్లేషణ మాత్రమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+