క్రిస్పీ 'తోటకూర పకోడీ'.. ఈజీగా ఇలా చేసుకోండి..!
పకోడీ అనగానే చాలామందికి నోరూరుతుంది. కానీ పకోడీని ఎక్కువగా ఉల్లిపాయలతో చేసుకుంటారు. ఇంకొంతమంది పాలకూర, క్యాబేజీతో చేస్తారు. కానీ తోటకూరతో పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.. తోటకూర పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు తోటకూర సన్నగా తరిగినది రెండు కప్పులు, శనగపిండి ఒక కప్పు, బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ లు, ఉల్లిపాయ సన్నగా తరిగినది ఒకటి పెద్దది, పచ్చిమిర్చి మూడు నుంచి నాలుగు సన్నగా తరిగినవి..
అలాగే అల్లం సన్నగా తరిగినది ఒక టేబుల్ స్పూన్, కారం ఒక టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, జీలకర్ర అర టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నీరు అవసరమైనంత, నూనె డీప్ ఫ్రై కోసం తీసుకోవాలి. ఇక తోటకూర పకోడీ తయారీ విధానం చూస్తే తోటకూరను బాగా కడిగి నీరు లేకుండా తుడవాలి. అలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ లో తోటకూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా కలపాలి.

ఇందులో శనగపిండి, బియ్యపు పిండి, కారం, పసుపు, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు పోసి గట్టిగా ఉండే మిశ్రమం తయారు చేయాలి. ఇప్పుడు పాన్ లో నూనె పోయాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలుగా నూనెలో వేయాలి. అలా మీడియం ఫ్లేమ్ లో మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి. క్రిస్పీగా అయ్యాక తీసి టిష్యూ పేపర్ మీద పెట్టాలి. అంతే సూపర్ టేస్టీ పకోడీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications