పోర్షే కారుపై సిమెంట్ మిక్సింగ్.. ఇది మరీ టూ మచ్ అన్నా !!

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అఖిల్ హేమాద్రి చేసిన వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన నివాస ప్రాంతంలో దెబ్బతిన్న రహదారిని ప్రభుత్వం స్పందన కోసం ఎదురుచూడకుండా స్వయంగా మరమ్మతు చేయించడంతో ఆయనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఈ చర్యలో ఆయన ఉపయోగించిన పద్ధతి మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తన లగ్జరీ Porsche కార్ బోనెట్‌పై సిమెంట్ కలపడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

కాగా రోడ్డు మరమ్మతు తర్వాత రక్షణ పొర తొలగించగా, కారుకు ఎటువంటి హానీ జరగలేదు. ఈ ప్రత్యేక పద్ధతి ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విన్యాసం కేవలం PR స్టంటా అని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీనిపై అఖిల్ హేమాద్రి స్పందిస్తూ, ఈ వీడియో "మా కంపెనీ బ్రాండ్‌ను ప్రోత్సహించడానికి, కారు రక్షణకు PPF ఎంత బలంగా ఉంటుందో చూపించడానికి" మాత్రమే రూపొందించానని తెలిపారు. వ్యాపార కోణం దాటి, ఇది ఒక కీలక సందేశాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు: "మనకు చెందిన వాటిని మనం రక్షించుకుంటే, మన పరిసరాలను శ్రద్ధగా చూసుకుంటే, బాధ్యతగా ప్రవర్తిస్తే, మనం పరిశుభ్రమైన, మెరుగైన దేశాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు.

viral-video-about-bengaluru-business-man-uses-his-porsche-car-to-mix-cement-for-fixing-pot-holes

ఇక ఈ వీడియో ద్వారా అఖిల్, ప్రతి పౌరుడి బాధ్యతను ప్రధానంగా నొక్కి చెప్పారు. "ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా, చక్కగా ఉంచుకోవడానికి బాధ్యత వహించాలి. మనం ప్రతిదానికీ ఎల్లప్పుడూ ప్రభుత్వంపై ఆధారపడకూడదు. మన దేశం అత్యధిక జనాభా కలిగిన దేశం, ప్రభుత్వ ప్రయత్నాలతో మాత్రమే మార్పు రాదు," అని ఆయన రాశారు. "మనలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తేనే నిజమైన మార్పు ప్రారంభమవుతుందని తెలియజేశారు.

గత ఏడాది చివర్లో, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులో గుంతల సమస్య లేదని, ఇదంతా 'సోషల్ మీడియా సృష్టి' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు శివకుమార్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+