ఒమన్ నౌకలోనే కుళ్లిపోతున్న నావికుడి బాడీ..! భారత్ కు తీసుకురాలేరా?

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దంలో భాగంగా హార్ముజ్ జలసంధిలో నౌకలపై వరుసగా దాడులు జరిగాయి. వీటిలో ఒమన్ తీరంలో ఓ నౌకపై అమెరికా జరిపిన దాడిలో భారత నావికుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆయన చనిపోయి రోజులు గడుస్తున్నా హార్ముజ్ లో నుంచి ఆ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాలేకపోతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress) కేంద్రం తీరుపై మండిపడుతూ ఇవాళ ట్వీట్ చేసింది.

జూన్ 11న ఒమన్‌లో చిక్కుకుపోయిన ఒక నౌకలో భారత సెకండ్ ఆఫీసర్ నిశాంత్ ఉర్తనాథన్ మరణించారని, గత రెండు మూడు రోజులుగా ఆయన పార్థివ దేహం హిందుస్థాన్‌కు తిరిగి రావడం కోసం ఎదురుచూస్తోందని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ లో తెలిపింది. కానీ మోదీ ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదని ఆరోపించింది. ఆయన శరీరం కుళ్లిపోతోంది, దానిని కాపాడటానికి ఆయన సహచరులు చల్లటి నీటి సీసాలను ఉపయోగించవలసి వస్తోందని వెల్లడించింది.

Congress Slams Modi Govt Over Delay in Repatriating Sailor s Body From Oman

నరేంద్ర మోదీ ఒక బలహీనమైన ప్రధానమంత్రి, ఆయన వైఫల్యాలు భారత పౌరుల మరణానంతరం కూడా వారిపై ప్రభావం చూపుతూనే ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రభుత్వం వీలైనంత త్వరగా నిశాంత్ జీ పార్థివ దేహాన్ని గౌరవప్రదంగా భారతదేశానికి తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇప్పటికే హార్ముజ్ లో నౌకలపై జరిగిన దాడుల్లో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అయినా వీరి మృతదేహాల్ని మాత్రం స్వదేశానికి తీసుకురాలేని పరిస్ధితి నెలకొంది. దీనిపై వారి బంధువులు, కుటుంబ సభ్యుల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+