"ఈ రాత్రితో ఇరాన్ నాగరికత సమాప్తం"-ఐరాస హెచ్చరికల్నీ లెక్కచేయని ట్రంప్..!
ఇరాన్ (iran)పై ఇజ్రాయెల్ తో కలిసి దాడులు ప్రారంభించి ఆరువారాలు ముగిసిపోతున్న తరుణంలో తీవ్ర అసహనంగా మారిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) మానవ చరిత్రలో అత్యంత దారుణమైన వినాశనానికి సిద్ధమయ్యారు. హార్ముజ్ జలసంధి విషయంలో తమతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ లో విధ్వంసం తప్పదని 48 గంటల డెడ్ లైన్ ఇచ్చిన ట్రంప్.. ఇప్పుడు అధి కాస్తా ముగుస్తున్న సమయంలో మరింత దారుణమైన హెచ్చరిక చేశారు.
ఈ రోజు ముగిసేలోగా ఇరాన్ నాగరికత (iran civilization) తుడిచిపెట్టుకుపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాల్ని షాక్ కు గురిచేస్తోంది. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో .. "ఈ రాత్రి ఒక పూర్తి నాగరికత అంతరించిపోతుంది, దానిని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుంది." అని రాశారు. పరిస్థితిని బట్టి చివరి నిమిషంలో దాడిని రద్దు చేసే అవకాశం ఉందని చెబుతూ.. ట్రంప్ తన వ్యూహాలను రహస్యంగా ఉంచుతున్నారు. ఈ రాత్రిని ప్రపంచపు సుదీర్ఘ, సంక్లిష్టమైన చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా ట్రంప్ అభివర్ణించారు.

అయితే, ఇప్పుడు పూర్తి, సమగ్రమైన పాలన మార్పు వచ్చింది కాబట్టి, విభిన్నమైన, తెలివైన, తక్కువ తీవ్రవాద భావాలున్న మనసులు విజయం సాధించినప్పుడు, బహుశా విప్లవాత్మకంగా అద్భుతమైనది ఏదైనా జరగవచ్చని ట్రంప్ తెలిపారు. ఎవరికి తెలుసు? ప్రపంచపు సుదీర్ఘ, సంక్లిష్టమైన చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటైన ఈ రాత్రి మనం తెలుసుకుంటాం. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, మరణం చివరకు అంతమవుతాయన్నారు. ఇరాన్ మహనీయులను దేవుడు ఆశీర్వదించుగాక!" అంటూ ముగించారు. ఇప్పటికే ఇరాన్ లో పౌర సదుపాయాల్ని టార్గెట్ చేస్తే యుద్ద నేరం అవుతుందంటూ ఐక్యరాజ్యసమితి సైతం అమెరికాను హెచ్చరించింది. అయినా ట్రంప్ ఈ వార్నింగ్ ను లెక్క చేసే పరిస్ధితి కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications