క్యాన్సర్ నుంచి కోలుకున్న ప్రధాని... పోస్ట్ వైరల్ !!

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తనకు ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయిన విషయం వెల్లడించారు. అంతే కాకుండా అందుకు విజయవంతంగా చికిత్స పొందినట్లు తెలిపారు. సాధారణ ఆరోగ్య పరీక్షల సమయంలో ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించడంతో.. వైద్యులు వెంటనే లక్షిత చికిత్స ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ సాధారణంగా వయసు పెరుగుతున్న పురుషుల్లో కనిపించే వ్యాధిగా స్పష్టం చేస్తున్నారు.

నెతన్యాహు వివరాల ప్రకారం.. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల చికిత్స సులభంగా సాగిందని వైద్యులు తెలిపారు. అధునాతన టెక్నాలజీతో చేసిన టార్గెటెడ్ థెరపీ ద్వారా కణితిని పూర్తిగా తొలగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా ఉందని, వైద్య పరీక్షలు కూడా సానుకూల ఫలితాలనే చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

israel-prime-minister-benjamin-netanyahu-post-about-curing-from-prostate-cancer-and-post-goes-viral

కాగా 76 ఏళ్ల నెతన్యాహు ప్రస్తుతం "అద్భుతమైన శారీరక స్థితిలో" ఉన్నానని.. తన అధికారిక కార్యక్రమాలను ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ పరిపాలన, భద్రతా సమావేశాలు, అంతర్జాతీయ సంబంధాలపై తన దృష్టి యథావిధిగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఆరోగ్య సమస్యను అధిగమించిన నెతన్యాహు, రాబోయే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీర్ఘకాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన, దేశ నాయకత్వాన్ని కొనసాగించాలనే సంకల్పంతో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో ఆయన అనుచరుల్లో నమ్మకం పెరిగినట్లు తెలుస్తోంది.

ప్రపంచ నాయకుల శుభాకాంక్షలు..

నెతన్యాహు ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా పలువురు నాయకులు స్పందిస్తూ, ఆయన త్వరగా కోలుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన అవసరం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+