ఎంబాప్పే విశ్వరూప ప్రదర్శనం: నాకౌట్స్ లో మట్టి కరిచిన మేటి జట్టు

ఫిఫా వరల్డ్‌కప్ లో ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాప్పే మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. స్వీడన్‌తో జరిగిన కీలక పోరులో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఘన విజయం సాధించి, ప్రిక్వార్టర్స్ లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఎంబాప్పే రెండు అద్భుతమైన గోల్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు. వరల్డ్‌కప్‌ నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా తన రికార్డును మరింత పటిష్టం చేసుకున్నాడు. లియోనెల్ మెస్సీతో సమవుజ్జీగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో ఎంబాప్పేతో పాటు బ్రాడ్లీ బార్కోలా కూడా ఓ గోల్ చేసి ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్వీడన్‌పై సాధించిన ఈ తిరుగులేని విజయంతో టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్‌గా ఉన్న డిఫెండింగ్ రన్నరప్ ఫ్రాన్స్.. ఈ నెల 4వ తేదీన ఫిలడెల్ఫియాలో జరగబోయే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో పరాగ్వేతో తలపడబోతోంది. నాకౌట్స్ లో కొమ్ములు తిరిగిన జర్మనీని పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి పరాగ్వే ఈ దశకు చేరుకున్న విషయం తెలిసిందే.

Superstar Mbappe Strikes Twice as France Crush Sweden 3-0 and Cruise Into the Round of 16 in FIFA

మ్యాచ్ మొదటి అర్ధభాగంలో స్వీడన్ డిఫెన్స్ విభాగం నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురైంది. మైఖేల్ ఒలీస్, ఉస్మాన్ డెంబెలే, అడ్రియన్ రాబియట్ వంటి ఫ్రాన్స్ ఫార్వర్డ్ ఆటగాళ్లు పదే పదే దాడులు చేసినప్పటికీ, మ్యాచ్ 44 నిమిషాల పాటు డిఫెండర్లు ఏ గోల్ కాకుండా నిలువరించారు. ఎట్టకేలకు 45వ నిమిషంలో కిలియన్ ఎంబాప్పే అద్భుతమైన నైపుణ్యంతో ఒక చురుకైన షాట్ తో స్వీడన్ డిఫెన్స్ ను బద్దలుకొట్టి గోల్ సాధించాడు. దీంతో మొదటి సగం ముగిసేసరికి ఫ్రాన్స్ జట్టు 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది.

ఆ తర్వాత ఫ్రాన్స్ ఆటగాళ్ల ధాటి ఏమాత్రం తగ్గలేదు. 53వ నిమిషంలో లభించిన చక్కటి అవకాశాన్ని బ్రాడ్లీ బార్కోలా ఎవరికీ అందనంత వేగంతో సూపర్ గోల్‌గా మలిచాడు. దీంతో ఫ్రాన్స్ ఆధిక్యం 2-0 కు పెరిగింది. ఈ గోల్‌తో తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిన స్వీడన్ రక్షణ లోపాలను ఫ్రాన్స్ అనుకూలంగా మార్చుకుంది. 74వ నిమిషంలో ఎంబాప్పే మరోసారి తన స్ప్రింట్ వేగంతో డిఫెండర్లను ఏమార్చి రెండో గోల్‌ను నమోదు చేశాడు. దీంతో ఫ్రాన్స్ గెలుపు ఖాయమైంది.

ఫ్రాన్స్ ప్రదర్శించిన దూకుడు మ్యాచ్ గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 61 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకుందీ జట్టు. ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై ఏకంగా 25 సార్లు గోల్స్ కోసం దాడులు జరిపింది. అందులో 12 షాట్లు నేరుగా స్వీడన్ గోల్ లక్ష్యంగా వెళ్లాయి. మరోవైపు 39 శాతం పొసెషన్‌తో రక్షణాత్మక ఆటకే పరిమితమైన స్వీడన్ జట్టు, మ్యాచ్ పొడుగునా కేవలం 8 షాట్లను మాత్రమే నమోదు చేయగలిగింది. ప్రత్యర్థి బాక్సులో ఫ్రాన్స్ 35 సార్లు టచ్స్ సాధించగా, స్వీడన్ సంఖ్య 14 మాత్రమే.

ఈ మ్యాచ్‌లో స్వీడన్ ముందంజ వేయడానికి ప్రయత్నించినప్పటికీ సమన్వయం లోపించింది. ముఖ్యంగా ఒక్క గోల్ అవకాశాన్ని కూడా సృష్టించలేకపోయారు. స్వీడన్ జట్టు ఎక్స్‌పెక్టెడ్ గోల్స్ రేటింగ్ కేవలం 0.70 వద్ద నిలిచిపోవడమే దీనికి నిదర్శనం. ఫ్రాన్స్ 3.24 ఎక్స్‌పెక్టెడ్ గోల్స్ నమోదు చేయడం ఈ జట్టు సత్తాకు అద్దం పట్టింది. స్వీడన్ గోల్‌కీపర్ మాత్రం అద్భుతమైన పట్టుదలతో పోరాడి తొమ్మిది క్లిష్టమైన సేవ్‌లతో ఫ్రాన్స్ స్కోరును కట్టడి చేశాడు.

స్వీడన్‌పై చేసిన ఈ రెండు గోల్స్‌తో ఎంబాప్పే వరల్డ్‌కప్‌ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నాడు. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ సాధించిన 19 గోల్స్ రికార్డుకు కేవలం ఒక్క గోల్ దూరంలో ఎంబాప్పే నిలిచాడు. అంతేకాకుండా, ఈ ఎడిషన్ గోల్డెన్ బూట్ రేసులో కూడా ఆరు గోల్స్‌తో మెస్సీతో సమానంగా దూసుకుపోతున్నాడు. రెండు అసిస్ట్‌ల ఆధిక్యంతో ప్రస్తుతం ఈ రేసులో ఎంబాప్పే అగ్రస్థానంలో నిలవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+