'మునగాకు పప్పు' ఇలా చేస్తే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు..!
పప్పు అనగానే చాలా మందికి నోరూరుతుంది. పప్పులో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచిని మాటలతో వర్ణించడం చాలా కష్టం. మరి మునగాకు పప్పును ఎప్పుడైనా ట్రై చేశారా..? మునగాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మరి మునగాకు పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఏంటి..? పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి..
'మునగాకు పప్పు' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే మునగాకు రెండు లేదా మూడు కప్పులు, కందిపప్పు లేదా అనప పప్పు ఒక కప్పు, పచ్చి కొబ్బరి తురుము అర కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, కారం ఒకటిన్నర టీ స్పూన్, అలాగే తాలింపు కోసం నెయ్యి కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 15, ఎండుమిర్చి ముక్కలు 10, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, ఇంగువ చిటికెడు, మినప పప్పు రెండు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి.
ఇప్పుడు 'మునగాకు పప్పు' తయారీ విధానం చూస్తే.. ముందుగా పప్పును తీసుకుని శుభ్రంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మునగాకును కూడా శుభ్రంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో పప్పు వేసుకుని వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత నీరు పోసి పప్పు మూడు వంతులు ఉండికించుకోవాలి. ఉడికిన పప్పు ను వడకట్టి పక్కకు తీసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి నూనే లేదా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి, మిరపకాయ ముక్కలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆకు పూర్తిగా వేగిన తర్వాత ఉడికించిన కందిపప్పు, కొబ్బరి తురుము వేసి వేయించాలి. అందులో చిటికెడు పసుపు, తగినంత కారం, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. చివరగా కొద్దిసేపు ఉడికిస్తే మునగాకు పప్పు రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications