Rape Festival: అక్కడ ఆడోళ్లు కనిపిస్తే పాపం..!

ప్రపంచంలోని అనేక దేశాల్లో వింత వింత ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయి. అందులో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాయి. అలాంటివి మిగతా దేశాలకూ విస్తరించాయి. కొన్ని మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్నాయి. అలాంటి వాటిలో నైజీరియాలోని 'రేప్ ఫెస్టివల్' ఒకటి.. నైజీరియాలోని డెల్టా రాష్ట్రంలో ఫెర్టిలిటీ ఫెస్టివల్ ను నిర్వహిస్తుంటారు. అయితే ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారి తీస్తోంది. వీధుల్లో, రోడ్లపై మహిళలను పరిగెత్తించి.. బలవంతంగా వారి బట్టలను విప్పి అత్యాచారాలకు పాల్పడుతున్నారు కొందరు మానవ మృగాలు. పురుషులు కొన్ని బృందాలుగా ఏర్పడి అక్కడి మహిళలను నగ్నంగా చేసి తమ కామ వాంఛ తీర్చుకుంటారు. ఇదంతా బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ను ఓరముడు కమ్యూనిటీ నిర్వహిస్తోంది.

ఈ ఫెస్టివల్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెర్టిలిటీ ఫెస్టివల్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నైజీరియాలోని మహిళలకు తక్షణం న్యాయం చేయాలని.. ఇలాంటి కార్యక్రమాలను బ్యాన్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫెర్టిలిటీ ఫెస్టివల్ లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో కొందరు పురుషులు గ్యాంగ్ లుగా ఏర్పడి మహిళల్ని ఛేదిస్తారు. అలా బలవంతంగా వారి దుస్తులను విప్పి నగ్నంగా చేసి తమ లైంగిక కోరికను తీర్చుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో అందరూ చూస్తుండగానే ఇలాంటి పనులు చేస్తుంటారు. వారికి ఎవరూ అడ్డుచెప్పకపోవడం గమనార్హం. ఈ ఫెస్టివల్ లో అధికంగా యువకులే పాల్గొంటారు.

ఇక వీరి చేతిలో బలయ్యేది స్థానిక యూనివర్సిటీలోని విద్యార్థినులు. దాంతో వెంటనే ఆ బాధితుల్ని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. అందులో ఓ బాధితురాలు, స్టూడెంట్ రోస్ మేరీ మాట్లాడుతూ.. తాను మోటర్ సైకిల్ పై ఆ ప్రాంతానికి రాగానే తనపై దాడులు జరిపారు. నన్ను చూసిన కొందరు యువకులు.. ఆమె మహిళ.. పట్టుకోండి.. పట్టుకోండి.. అని అరిచారు. తేనెటీగల మాదిరి నా వెంట పడ్డారు. నా బట్టలను పూర్తిగా చింపేశారు. నా శరీరాన్ని మొత్తం తాకారు. నేను సాయం చేయండి అని అరిచాను. ఓ వ్యక్తి మధ్యలో కలుగజేసుకోవడంతో తాను బయటపడ్డాను. ఈ ఘటనలో నా మొబైల్ కొట్టేశారు. ఈ ఘటనపై నేను బాధపడుతున్నాను.. అని స్టూడెంట్ రోస్ మేరీ చెప్పుకొచ్చింది.

Nigeria Rape Festival Public Atrocities Against Women Trigger Widespread Global Condemnation

ఈ ఘటనలపై సర్వత్రా ఆగ్రహాలు వ్యక్తం కావడంతో ఇటీవల పోలీసులు ఈ కమ్యూనిటీ హెడ్ అయిన ఓమెరెడే సండే తోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. మరోవైపు సంప్రదాయం పేరుతో మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే ఇలాంటి పేరుతో మహిళల గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి పద్దతులను అరికట్టాలని మానవ హక్కులు డిమాండ్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+