అర్ధరాత్రి రష్యా రాక్షస దాడి: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ పుతిన్ సేన

అర్ధరాత్రి వేళ.. ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయం.. ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చెవులు బద్దలయ్యేలా ఎయిర్-రైడ్ సైరన్లు మోగాయి.. ఊహించని క్షణాల్లో ఆకాశం నుంచి డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై నిప్పుల వర్షం కురిపించాయి. గురువారం తెల్లవారుజామున రష్యా ఏకకాలంలో జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడులతో కీవ్ నగరం అతలాకుతలమైంది. నగరవ్యాప్తంగా శక్తివంతమైన పేలుళ్లు సంభవించగా, నివాస సముదాయాలు, హోటళ్లు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. కీవ్‌ నగరంపై రష్యా మరో ఘోరమైన "మాసివ్ స్ట్రైక్" (భారీ దాడి)కి ప్లాన్ చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దారుణం జరిగిపోయింది.

క్షిపణుల వర్షం.. కూలిన అపార్ట్‌మెంట్లు!

రష్యా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల ధాటికి కీవ్ నగర కేంద్రంలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు (Air Defence) శత్రు క్షిపణులను అడ్డుకునేందుకు ఎదురుదాడికి దిగడంతో ఆకాశం యుద్ధభూమిని తలపించింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సంభవించిన వరుస పేలుళ్లతో భూమి కంపించినట్లయింది.

Kyiv Under Fire Russia Launches Massive Overnight Missile And Drone Strike On Ukraine Capital City

కీవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో తెలిపిన వివరాల ప్రకారం.. దాడి ధాటికి ఒక 9 అంతస్తుల భారీ నివాస భవనం (అపార్ట్‌మెంట్) పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆ శిథిలాల కింద అనేకమంది పౌరులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. మరో జిల్లాలో ఒక ప్రముఖ హోటల్ పైకప్పు పూర్తిగా తగలబడిపోయింది. ఈ దాడిలో ఐదుగురు వైద్య సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఉక్రెయిన్ దెబ్బకు సర్వం కోల్పోతున్న రష్యా.. పుతిన్ సంచలన నిర్ణయం
ఉక్రెయిన్ దెబ్బకు సర్వం కోల్పోతున్న రష్యా.. పుతిన్ సంచలన నిర్ణయం

ప్రాణాలు చేతబట్టుకుని సబ్‌వే స్టేషన్లకు..

అధికారులు ముందే హై-అలర్ట్ ప్రకటించడంతో వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకునేందుకు తమ పెంపుడు జంతువులు, స్లీపింగ్ బ్యాగులను తీసుకుని భూగర్భ సబ్‌వే (మెట్రో) స్టేషన్లకు పరుగులు తీశారు. క్షిపణుల దాడి ముగిసేవరకు బంకర్లు, సురక్షిత ప్రాంతాల నుంచి బయటకు రావద్దని మేయర్ క్లిట్ష్కో ప్రజలను వేడుకున్నారు. రష్యా ఇంధన సరఫరా కేంద్రాలు, రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ ఇటీవల కాలంలో లాంగ్-రేంజ్ డ్రోన్ దాడులను తీవ్రం చేయడంతోనే పుతిన్ ఈ రేంజ్‌లో ప్రతీకార దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఐర్లాండ్‌ పర్యటన ముగించుకుని వస్తున్న జెలెన్స్కీ స్పందిస్తూ.. "పుతిన్ యుద్ధాన్ని కొనసాగించడానికే ఇష్టపడుతున్నాడు. అందుకే అతను ఈ యుద్ధాన్ని ఆపక తప్పని కఠిన పరిస్థితులను మేము సృష్టిస్తాం" అని ప్రతిజ్ఞ చేశారు.

పుతిన్ ఫ్రెండ్ నౌక విశేషాలు! 'నార్డ్’ రేటు వింటే మైండ్ బ్లాక్!
పుతిన్ ఫ్రెండ్ నౌక విశేషాలు! 'నార్డ్’ రేటు వింటే మైండ్ బ్లాక్!

అమెరికాకు రష్యా తీవ్ర హెచ్చరిక!

ఇదిలావుండగా, ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న నిరంతర సైనిక సాయంపై రష్యా విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాషింగ్టన్ చేస్తున్న ఇటువంటి పనులు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి "ఊహించని పరిణామాలకు" (Unforeseen Consequences) దారితీస్తాయని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా హెచ్చరించారు. కీవ్ ప్రభుత్వానికి ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా అమెరికా నిప్పుతో చెలగాటం ఆడుతోందని, అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 'ఉగ్రవాద ధోరణి'ని ప్రదర్శిస్తున్నారని ఆమె ఆరోపించారు. రష్యా హెచ్చరికలు, తాజా భీకర దాడులతో యూరప్‌లో ఉద్రిక్తతలు మరోసారి గరిష్ఠ స్థాయికి చేరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+