టెంపుల్ స్టైల్ 'చక్కెర పొంగలి'.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది..!
రానున్న రోజుల్లో ఆషాఢ మాసం, శ్రావణ మాసం రానున్నాయి. సాధారణంగా ఈ నెలల్లో మహిళలు పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, నోములు, వ్రతాలు చేసుకుంటారు. అలా భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుతుంటారు. అయితే ఈ సమయంలో చాలామంది నైవేద్యం కోసం స్వీట్ పొంగలిని ప్రిపేర్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ పొంగలి తీపి కరెక్ట్ గా సరిపోక రుచికరంగా రాకపోవడమో.. లేదా మెత్తగా అవ్వడమో జరుగుతూ ఉంటుంది. మరి వారు ఓసారి ఈ పక్కా కొలతలతో టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
టెంపుల్ స్టైల్ 'చక్కెర పొంగలి' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే బియ్యం ఒక కప్పు, పెసరపప్పు పావు కప్పు, బెల్లం తురిమినది ఒక కప్పు లేదా తగినంత, నీరు మూడు నుంచి మూడు పావు కప్పు, పాలు ఒక కప్పు, నెయ్యి పావు కప్పు, యాలకుల పొడి అర టేబుల్ స్పూన్, జీడిపప్పు 10 నుంచి 12, కిస్ మిస్ 10 నుంచి 12, నెయ్యి ఒక టేబుల్ స్పూన్, కర్పూరం చిటికెడు తీసుకోవాలి. ఇప్పుడు 'చక్కెర పొంగలి' తయారీ విధానం చూస్తే.. ముందుగా బియ్యం, పెసరపప్పు, శుభ్రంగా కడిగి 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత నానబెట్టిన బియ్యం, పెసరపప్పు, 3 కప్పుల నీళ్లు వేసి ప్రెషర్ కుక్కర్ లో మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. అలా మెత్తగా అయ్యేంత వరకూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం, అర కప్పు నీరు వేసి కరిగించుకోవాలి. అలా పడగటి పాకాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ముగ్గిన బియ్యానికి బెల్లం పాకాన్ని వేసి బాగా కలపాలి.

తగ్గిన వేడిలో ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పాన్ లో నెయ్యి కాల్చి అందులో జీడిపప్పు, కిస్ మిస్ వేసి బంగారం రంగులో వేయించుకోవాలి. ఆ తర్వాత తాళింపును చక్కెర పొంగలిలో వేసి అందులోనే యాలకుల పొడి, కర్పూరం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడి వేడి చక్కెర పొంగలి సిద్ధం అయినట్టే..












Click it and Unblock the Notifications