అల్పపీడనం, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో ఒక్క సారిగా మార్పు కనిపిస్తోంది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడునున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం కారణంగా జూలై 8వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీతో పాటుగా తెలంగాణ జిల్లాల్లోనూ ఈ నెల 8వ వరకు వర్షాలు కొనసాగున్నాయని అంచనాగా వెల్లడించింది. అదే విధంగా పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల పైన తాజాగా అలర్ట్ జారీ అయింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జూలై 8వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రుతుపవనాలు సైతం చురుకు మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని శుక్రవారం (జూలై 3) బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది క్రమంగా రాజస్థాన్ వైపు పయనిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల జూలై 4 నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు ప్రారంభమై.. జూలై 5 నుంచి రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.. గురువారం (జూలై 2) నాడు, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో మేఘావృతమైన ఆకాశం ఉంటుందిని పేర్కొంది.

ఈ నెల 8వ తేదీ వరకు వర్షాలు
అదే విధంగా కొన్నిచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జూలై 4 నుంచి వర్షాల తీవ్రత పెరిగి, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా తెలంగాణ జిల్లాల పైన అల్ప పీడన ప్రభావం కనిపిస్తోంది. ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాజధాని హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలై 4 (శనివారం) నుంచి జూలై 8 (బుధవారం) వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications