కేబినెట్ భేటీ: రైతులకు తీపి కబురు, ఖాతాల్లో ఎకరానికి రూ 5 వేలు..!!

తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరో తీపి కబురు అందించేందుకు సిద్దమైంది. కొంత కాలంగా ప్రతిపాదనల స్థాయిలో ఉన్న అంశాలకు ఆమోదం తెలపనుంది. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రైతుభరోసా పథకాన్ని ప్రక్షాళన చేసి.. తద్వారా మిగిలిన నిధులను పంటల బోనస్‌, పంటల బీమా పథకాలకు మళ్లించాలనే ప్రతిపాదన పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.

తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు పై ప్రోత్సాహం అందించేలా కీలక ప్రతిపాదనలను పరిశీలన చేస్తోంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వరిని అవసరం మేరకు ఉత్పత్తి చేసుకుని, దిగుమతి చేసు కుంటున్న ఇతర ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొంది స్తోంది. ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాల్లోకే కనీస మద్దతు ధర జమ చేయడం, ఏడు రకాల సన్నాలకు బోనస్‌ చెల్లిస్తుండడంతో.. ప్రస్తుతం రైతులు వరి సాగుకే ఎక్కువ మొగ్గు చూపుతు రు. ఈ నేపథ్యంలో.. రైతులను ఇతర పంటల సాగు వైపు మళ్లించడానికి, ప్రత్యామ్నాయ పంటల గును ప్రోత్సహించడానికి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగులో స్వయం మృద్ధి సాధించడానికి ఎకరానికి ఎంతో కొంత 'బోనస్‌' ఇవ్వాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. రైతు భరోసాను కొనసాగిస్తూనే.. స్వచ్ఛందంగా పంటల మార్పిడి చేసే రైతులకు ఎకరానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ బోనస్‌ ఇవ్వాలని, పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్నలు తదితర ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలనే ప్రతిపాదనల పైన ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆర్బీఐ మాజీ గవర్నర్ కు నిర్మలమ్మ బాధ్యతలు- కొత్త మంత్రులు..శాఖల మార్పు ఇలా..!?
ఆర్బీఐ మాజీ గవర్నర్ కు నిర్మలమ్మ బాధ్యతలు- కొత్త మంత్రులు..శాఖల మార్పు ఇలా..!?
telangana-cabinet-to-approve-big-decisions-over-farmers-issues-and-changes-in-bharosa-implementation

కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

అదే విధంగా వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలు.. తదితర పంటల సాగును కూడా పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఆయా పంటలకు రూ.నాలుగైదు వేల పోత్సాహకం ఇవ్వాలంటూ ప్రభుత్వానికి వచ్చిన సిఫారసులపై క్యాబినెట్‌ భేటీలో ప్రధానంగా చర్చించనున్న తెలిసింది. ఇక.. రైతుభరోసా పథకాన్ని ప్రక్షాళన చేసి.. తద్వారా మిగిలిన నిధులను పంటల బోనస్‌, పంటల బీమా పథకాలకు మళ్లించాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో.. వచ్చే ఏడాది నుంచి శాటిలైట్‌ మ్యాపింగ్‌ చేసి, ఎవరు పంటలు వేశారు? ఏ పంటలు వేశారనే వివరాలు సేకరించి.. కేవలం సాగుచేసిన భూములకు మాత్రమే రైతుభరోసా చెల్లించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు ఉన్న భూములకు రైతుభరోసా ఇవ్వకూడదని భావిస్తుస్తోందని సమాచారం.. వీబీజీరామ్‌జీ కార్యక్రమం అమలుపైనా చర్చించనున్నారు. వీబీజీరామ్‌జీ నిర్వహణకు సంబంధించి కేంద్రం సూచించిన మార్గదర్శకాలు.. రాష్ట్రం వాటా 40శాతం చెల్లింపు, ఇతర అంశాలపై చర్చించి ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+