దేశంలో గ్యాస్ సంక్షోభం: ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ ను స్టోర్ చేస్తున్న ప్రజలు..!

పాకిస్థాన్‌లోని కరాచీ నగరం తీవ్ర గ్యాస్ కొరతతో అల్లాడుతోంది. ఈ సంక్షోభం కారణంగా ప్రజలు వంట చేసుకోవడానికి ప్రమాదకరమైన, అసాధారణ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ నింపి, వాటిని వంటకు ఉపయోగించడం అక్కడ సర్వ సాధారణంగా మారింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. గ్యాస్ లోడ్ షెడ్డింగ్, తక్కువ ప్రెషర్ కారణంగా నగరంలో రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఓరంగి టౌన్, మోమినాబాద్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరైన గ్యాస్ సరఫరా లేకపోవడంతో, వంట కోసం తమకు వేరే మార్గం లేదని స్థానికులు వాపోతున్నారు.

గ్యాస్ సరఫరా కొంతసేపు పునరుద్ధరించబడినప్పుడు, ప్రజలు ప్రత్యేకంగా రూపొందించిన ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ నింపుకుంటున్నారు. ఈ నిల్వ చేసిన బెలూన్లను రోజువారీ వంట పనులకు వాడుకుంటున్నారు. స్థానిక మార్కెట్లలో ఈ బెలూన్లు రూ.1,000 నుంచి రూ.1,500 రూపాయలకు లభిస్తున్నాయి.

అయితే నిపుణులు ఈ పద్ధతిని అత్యంత ప్రమాదకరంగా అభివర్ణించారు. వారి అభిప్రాయం ప్రకారం.. ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్ నింపడం మొబైల్ బంబులను మోయడమే. స్వల్ప ఘర్షణ, వేడి లేదా చిన్న నిప్పురవ్వ కూడా భారీ పేలుడుకు కారణం కావచ్చు. ఇలాంటి గ్యాస్ నిండిన బెలూన్లను ఇళ్లలో ఉంచడం అగ్ని ప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

డొమెస్టిక్ గ్యాస్ (మీథేన్/ఎల్‌పీజీ) అత్యంత మండే స్వభావం కలిగి ఉంటుంది. ప్లాస్టిక్ బెలూన్లు గ్యాస్ నిల్వ చేయడానికి తయారు చేయలేదు. అవి చాలా బలహీనంగా ఉంటాయి. అందువల్ల గ్యాస్ త్వరగా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. కొద్దిగా ఒత్తిడి, ఘర్షణ లేదా అధిక వేడి తగిలినా బెలూన్ పగిలిపోతుంది. పగిలిన వెంటనే గ్యాస్ వేగంగా బయటకు వచ్చి తక్షణమే మంటలు వ్యాపించవచ్చు లేదా పేలుడు సంభవించవచ్చు. ప్రపంచ ఇంధన సరఫరాపై ఒత్తిడి పెరిగిన సమయంలో ఈ పరిస్థితి ఏర్పడింది.

Pakistan Gas Crisis Karachi Locals Use Risky GasFilled Balloons for Cooking Fuel Supplies Collapse

యూఎస్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఇంధన సరఫరా గొలుసు ప్రభావితమైంది. ఇది హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాలపైనా ప్రభావం చూపింది. కరాచీలో గ్యాస్ కొరత, తక్కువ ప్రెషర్, సుదీర్ఘ అంతరాయాల సమస్య చాలా సంవత్సరాలుగా ఉంది. శీతాకాలంలో డిమాండ్ పెరిగి, సరఫరా సరిపోకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ప్రజలు గతంలో కూడా ప్రత్యామ్నాయ, తాత్కాలిక పరిష్కారాలను ఆశ్రయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+