IND Vs IRE: బుడ్డోడికి ఈసారీ నిరాశే- గంభీర్, అయ్యర్ పై తీవ్ర విమర్శలు..!

ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత యువ బ్యాటింగ్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) కి తుది జట్టులో చోటు దక్కకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ ఈ నిర్ణయంపై ఘాటుగా స్పందించారు. వైభవ్‌ను ప్రతీ మ్యాచ్‌లోనూ బెంచ్‌కే పరిమితం చేయడం ఎంతమాత్రం సమర్థించరానిదని ఆయన నిలదీశారు. అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్‌లను జట్టులోకి తీసుకున్నప్పటికీ వైభవ్‌ను పక్కన పెట్టడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

వైభవ్‌కు నో ఛాన్స్.. టాలెంట్‌కు రూల్స్ అడ్డొచ్చినయా?
వైభవ్‌కు నో ఛాన్స్.. టాలెంట్‌కు రూల్స్ అడ్డొచ్చినయా?

తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు మిడిల్ ఆర్డర్ వైఫల్యం స్పష్టంగా బయటపడింది. కేవలం ఓపెనర్లు మాత్రమే రాణిస్తే సరిపోదని, వారి తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్లు కూడా భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. తాను ఏదో గుడ్డిగా వైభవ్ సూర్యవంశీకి మద్దతు ఇవ్వడం లేదని, జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఒక నమ్మకమైన ప్యూర్ బ్యాటర్ అవసరమనే కోణంలోనే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. వైభవ్‌ను ఓపెనర్‌గా పంపిస్తే ఆట తీరు మరింత మెరుగ్గా ఉండేదని ఆయన సూచించారు.

{image-vaibhav-sooryavanshi-gambhir-ayyar-jpg-1782655958800_1782655967614-600x338.jpgtelugu.oneindia.com}

IND vs IRE: వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే?
IND vs IRE: వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే?

మిడిల్ ఆర్డర్ బలాన్ని పెంచేందుకు వైభవ్‌ను ఓపెనర్‌గా పంపించి, అనుభవజ్ఞుడైన సంజు శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే బాగుండేదని మంజ్రేకర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వేదికగా చెప్పారు. కీలక స్థానాల్లో సరైన మార్పులు చేయకపోవడం జట్టు వ్యూహాత్మక లోపాలను ఎత్తిచూపుతోందని ఆయన విశ్లేషించారు. మెరుగైన స్థిరత్వంతో కూడిన ఫలితాల కోసం రాబోయే రోజుల్లో తుది జట్టు ఎంపిక విషయంలో సరైన క్రికెట్ నిర్ణయాలు తీసుకోవాలని యాజమాన్యానికి హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+