థియేటర్‌లో ఎవరూ పట్టించుకోలేదు.. కానీ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్.. యూట్యూబ్‌లో ఫ్రీ

కొన్ని సినిమాలు అంతే... థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రమోషన్లు సరిగ్గా లేకనో, సమయం కలిసిరాకనో ఎవరూ పట్టించుకోరు. బాక్సాఫీస్ దగ్గర సైలెంట్‌గా వచ్చి అంతే సైలెంట్‌గా వెళ్లిపోతుంటాయి. కానీ, ఏదో ఒక రోజు ఓటీటీలోనో లేక యూట్యూబ్‌లోనో చూసినప్పుడు మాత్రం... "అరే! ఎంత మంచి సినిమాను మిస్ అయ్యాంరా!" అని కచ్చితంగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక అరుదైన, మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ గురించే మనం చెప్పుకోబోతున్నాం! ఆ సినిమా పేరే A (యాడ్ ఇన్ఫినిటిం).

Viswanath & Sons First Review: ఆ ట్విస్టుతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది..!
Viswanath & Sons First Review: ఆ ట్విస్టుతో సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది..!

బాక్సాఫీస్ మిస్ చేసిన మాస్టర్‌పీస్!

2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అప్పట్లో ఏమాత్రం హడావుడి లేకుండా వచ్చి వెళ్లిపోయింది. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని యుగంధర్ ముని తెరకెక్కించారు. ఈ దర్శకుడి పేరు మీకు కాస్త పరిచితంగానే అనిపిస్తోందా? అవును... గతేడాది చివర్లో సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సూపర్‌హిట్ సినిమా 'శంబాల' దర్శకుడు ఈయనే! ప్రస్తుతం ఈయన సందీప్ కిషన్‌తో 'కరికాల' అనే భారీ పీరియాడిక్ సినిమాను రూపొందిస్తున్నారు. యుగంధర్ ముని తొలి ప్రయత్నంగా 'క్రౌడ్ ఫండింగ్' పద్ధతిలో రూపొందిన 'A' కమర్షియల్‌గా సక్సెస్ కాకపోవచ్చు... కానీ, ఆయన మేకింగ్ టాలెంట్‌కు, టేకింగ్‌కు సినిమా ప్రేమికులు ఫిదా అయిపోయారు.

సినిమా ఆఫర్ పేరుతో దారుణం: 33 ఏళ్ల నటిపై లైంగిక దాడి.. దర్శకుడు అరెస్ట్!
సినిమా ఆఫర్ పేరుతో దారుణం: 33 ఏళ్ల నటిపై లైంగిక దాడి.. దర్శకుడు అరెస్ట్!
Ad Infinitum No One Cared in Theaters But This Mind Blowing Thriller Is Now Free on YouTube

కథేంటి?

ఇదొక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్. కథానాయకుడు సంజీవ్‌కు తన గతం ఏంటో అస్సలు గుర్తుండదు. ఉన్నదంతా మరిచిపోయి, వివాహం చేసుకుని ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అంతా బాగుందనుకునే సమయంలో... ఆయనను గతం తాలుకూ కొన్ని వింత కలలు, దిగ్భ్రాంతికర సంఘటనలు వెంటాడటం మొదలవుతాయి. అసలు తన గతం ఏంటి? తనకు ఎందుకు ఆ వింత కలలు వస్తున్నాయి? తన గతం చెరిగిపోవడానికి వెనుక ఉన్న అసలు నిజమేంటి? అని తెలుసుకోవడానికి తన స్నేహితుడితో కలిసి సంజీవ్ చేసే అన్వేషణే ఈ సినిమా కథ. సంజీవ్ పాత్ర చుట్టూ దర్శకుడు అల్లుకున్న మిస్టరీ, ఆ పాత్ర ఇచ్చే ట్విస్టులు మిమ్మల్ని చివరిదాకా స్క్రీన్‌కు కట్టిపడేస్తాయి. కథనం కొంతమందికి కాస్త గజిబిజిగా, సస్పెన్స్ విషయంలో కాస్త నెమ్మదిగా అనిపించినప్పటికీ... చివరి వరకు కట్టిపడేస్తుంది. దర్శకుడు సాధించిన ఔట్‌పుట్ నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఒక పెద్ద ప్రొడ్యూసర్ మద్దతు ఉండి ఉంటే ఈ సినిమా స్థాయి వేరేలా ఉండేదేమో!

ఎక్కడ చూడొచ్చు?

మీరు కనుక ఇప్పటివరకు ఈ మోస్ట్ అండర్ రేటెడ్ మైండ్ గేమ్‌ను చూడకపోతే... అసలైన థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మిస్ అయినట్లే! ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండటంతో పాటు, యూట్యూబ్‌ లో ఉచితంగా అందుబాటులో ఉంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు అస్సలు మిస్ కావొద్దు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+