ఏపీలో బీసీ రిజర్వేషన్లు, కీలక సిఫారసులు - 50 శాతం పరిమితి మించకుండా ..అమలు ఇలా..!!

ఏపీలో మరో కీలక నిర్ణయం దిశగా కసరత్తు జరుగుతోంది. బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కీలక సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు పై చేసిన ప్రతిపాదనల్లో స్థానిక జనాభా ప్రకారం రిజర్వేషన్ల అమలు చేసేందుకు వీలుగా ఈ సిఫార్సులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిఫారసుల పైన మంత్రివర్గ ఉప సంఘం చర్చించి.. ప్రభుత్వానికి తమ నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా రిజర్వేషన్ల పైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.

బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వం నియమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు స్థానిక ఎన్నికల్లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో స్థానిక బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చేసే విధంగా ప్రతిపాదనలు చేసారని సమాచారం. బీసీ రిజర్వేషన్ల అమలు వేళ ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా కీలక సూచనలు అందించినట్లు తెలుస్తోంది. ఈ కమిషన్ దాదాపు ఏడు నెలల పాటు కసరత్తు కొనసాగించింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితి మించకుండా బీసీలకు ప్రయోజనం చేకూర్చే ముఖ్యమైన ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.

 విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా మరో రైలు - రూట్, టైమింగ్స్..!!
విశాఖ నుంచి తిరుపతికి కొత్తగా మరో రైలు - రూట్, టైమింగ్స్..!!
rajiv-ranjan-mishra-commission-submits-key-proposals-on-bc-reservations-in-ap-local-bodies

నివేదికలో కీలక ప్రతిపాదనలు..!

బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి వెనుకబడిన తరగతుల జనాభాను నిర్ధారించడానికి కమిషన్ ఏకీకృత కుటుంబ సర్వే అధారంగా ముందుకు వెళ్లింది. సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు బీసీ రిజర్వేషన్లను నిర్ధారించడానికి మండలాన్ని యూనిట్‌గా పరిగణిస్తూ..పట్టణ స్థానిక సంస్థలకు మున్సిపల్ వార్డులు యూనిట్‌గా నిర్దారించినట్లు సమాచారం. మండల పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభాకు అనుపాతంలో సీట్లు కేటాయించిన తర్వాత, మిగిలిన సీట్లను మొత్తం 50% రిజర్వేషన్ పరిమితికి లోబడి స్థానిక బీసీ జనాభా ఆధారంగా కేటాయించేలా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. మున్సిపల్ ఛైర్‌పర్సన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణలోకితీసుకోనున్నారు. కమిషన్ సమర్పించిన నివేదిక పరిశీలీలన పై ఒక మంత్రివర్గ ఉప-సంఘాన్ని ఏర్పాటు చేసి.. వారు సిఫార్సులను ఆమోదించిన తర్వాత ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. ఆ తదుపరి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టే విధంగా కసరత్తు జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+