జూనియర్ ఎన్టీఆర్‌ కు శస్త్రచికిత్స విజయవంతం.. కిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ కు శస్త్ర చికిత్స విజయవంతం అయింది. హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు సర్జరీ చేశారు. ఎన్టీఆర్ భుజానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్ ఆర్. ఏ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి ఆధ్వర్యంలో చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరో 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని అన్నారు. కాగా, గతనెల 27న జిమ్​లో వర్కౌట్స్ చేస్తుండగా తారక్​ భుజానికి గాయమైన విషయం తెలిసిందే.

ఆగస్టు 12 న సికింద్రాబాద్​ కిమ్స్​ ఆస్పత్రిలోని ఆర్దోపెడిక్ సర్జన్ డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు బృందం​ ఆయన భుజానికి సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం వైద్య బృందం సమక్షంలో రిహబిలిటేషన్ ​లో ఉన్నారు. ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరో 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది.. అని కిమ్స్ హాస్పిటల్ ఎన్టీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. అయితే తారక్ కు గాయం కారణంగా మరో మూడు నెలలపాటు షూటింగ్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ మూవీ రిలీజ్ పై ప్రభావం పడే అవకాశం ఉంది.

NTR Surgery on Junior NTR successful discharged from KIMS Hospital JrNTR Dragon movie latest Update

అయితే డ్రాగన్ చిత్ర యూనిట్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. ఓవైపు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ.. డ్రాగన్ చిత్రం షూటింగ్ ను కొనసాగించాలని భావిస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 3 నుంచి షూటింగ్ రీ స్టార్ట్ కానున్నట్లు స్పష్టం అవుతోంది. ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రకు సంబంధించిన సీన్లు, ఎన్టీఆర్ లేని సీన్లను చిత్రీకరించాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డ్రాగన్ చిత్రానికి సంబంధించి కొంతమేర టాకీ పార్ట్ కూడా కంప్లీట్ చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డ్రాగన్ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ ఫీమేల్ లీడ్​ లో నటిస్తోంది. అలాగే అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+