అరేబియా సముద్రంలో చిక్కుకున్న భారత నౌక.. రక్షించిన పాకిస్థాన్ నేవీ..
గతేడాది ఏప్రిల్ 22 న పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పాకిస్థాన్ పై ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. దాంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి ఆంక్షలు విధించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అరేబియా సముద్రంలో చిక్కుకుపోయిన భారత్ కు చెందిన ఓ నౌకను పాకిస్థాన్ నేవీ తక్షణమే స్పందించి కాపాడింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ డాన్ తన కథనంలో వెల్లడించింది.
ఒమన్ నుంచి అరేబియా సముద్రం గుండా భారత్ కు వస్తున్న ఎంవీ గౌతమ్ అనే భారత్ కు చెందిన ఆఫ్ షోర్ టగ్ అండ్ సప్లై వెసెల్ లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో నౌకలో ఆరుగురు భారతీయులు, ఒక ఇండోనేషియన్ సిబ్బంది ఉన్నారు. అయితే నౌక ప్రమాదంలో ఉందని గుర్తించిన ముంబైలోని మేరిటైమ్ రెస్క్యూ కో- ఆర్డినేషన్ సెంటర్.. ఈ మేరకు పాకిస్థాన్ నేవీని కాపాడాలని రిక్వెస్ట్ చేసింది.

దాంతో తక్షణమే స్పందించిన పాకిస్థాన్ అధికారులు పాకిస్థాన్ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీ సాయంతో రంగంలోకి దిగింది. రక్షణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు నౌకలోని సిబ్బందికి పాకిస్థాన్ నేవీ ఎమర్జెన్సీ సాయం చేసింది. అందులో ఆహారం, వైద్యం, సాంకేతిక సదుపాయం అందించింది. పాకిస్థాన్ అరేబియా సముద్రంలో మానవతా దృక్పథంతో వ్యవహరించడంతో ఆపదలో ఉన్న నావికులకు ఊరట లభించినట్టు అయింది. అరేబియా సముద్రంలో పాకిస్థాన్ ఇలాంటి సహాయక చర్యలు చేయడం ఇది రెండోసారి గత నెలలో 18 మంది సిబ్బందితో వెళ్తున్న ఓ నౌక ప్రమాదంలో పడగా ఇలాగే పాకిస్థాన్ నేవీ వారిని కాపాడింది.












Click it and Unblock the Notifications