గేరు మార్చిన చంద్రబాబు, కీలక నిర్ణయం- ఇక నుంచి..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం సమా యత్తం అవుతోంది. ఇందు కోసం సీఎం చంద్రబాబు కొత్త నిర్ణయాలు అమలు చేస్తున్నారు. నేరుగా జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేస్తూ.. ప్రజల్లోకి వెళ్లి వివరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా వరుసగా అయిదు జిల్లాల పర్యటనల ద్వారా సీఎం చంద్రబాబు రాజకీయంగా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రులకు.. పార్టీ నేతలకు పదే పదే జనంతో మమేకం కావాలని సూచిస్తున్నారు. ఇప్పుడు తానే స్వయంగా ప్రజల వద్దకు వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేసారు. జూలై 1 నుంచి 5వ తేదీ వరకూ వరుస కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధం అయ్యారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలలో ముఖ్యమంత్రి పర్యటనలు ఉన్నాయి. ఈ జిల్లాల పర్యటనల వేళ చంద్రబాబు ఆ జిల్లాల్లోనే బస చేయనున్నారు. జూలై ఒకటవ తేదీన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కోసం నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో బాబు పర్యటించనున్నారు. ఇక అదే రోజు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ దాదాపు 750 కోట్ల రూపాయల పెట్టుబడులతో హీరో సంస్థ ఈ పార్ట్స్ సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. దీనికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక రాత్రికి చంద్రబాబు అక్కడే బస చేస్తారని అధికారులు చెబుతున్నారు.

తల్లికి వందనం నిధుల జమ ఆ రోజునే, ప్రభుత్వ తాజా నిర్ణయం..!!
తల్లికి వందనం నిధుల జమ ఆ రోజునే, ప్రభుత్వ తాజా నిర్ణయం..!!
cm-chandra-babu-will-launch-the-pedala-sevalo-pension-distribution-programme-at-chillakur-mandal

వరుస జిల్లాల పర్యటనలతో

కాగా, జూలై 2వ తేదీన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తిరుపతి పట్టణంలో ప్రైవేటు హోటల్ లో జరిగే కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ నకు హాజరవుతారు. ఈ వర్క్ షాప్ నకు నీతి ఆయోగ్ సభ్యులతో పాటు, పీఎం ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారు. రెండో తేదీ రాత్రి తిరుపతిలోనే చంద్రబాబు బస చేస్తారు. మూడవ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మూడు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు కుప్పం వెళతారు. 3 తేదీ నుంచి 5 వతేదీ వరకు కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇలా జిల్లా పర్యటనలు చేస్తూ అక్కడే బస చేస్తూ బాబు పూర్తి బిజీ కానున్నారు. తిరిగి ఆయన 5వ తేదీన అమరావతికి తిరిగి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+