Sudan Plane Crash: కుప్పకూలిన విమానం.. 14 మంది మృతి

దక్షిణ సుడాన్ రాజధాని అయిన జుబా నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో పైలట్ తో పాటు 13 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం యే నుంచి జుబా అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తక్కువ విజిబులిటీ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మృతి చెందినవారిలో ఇద్దరు కెన్యా జాతీయులు కాగా.. మిగిలిన వారు సూడాన్ కు చెందినవారుగా గుర్తించారు.

దక్షిణ సుడాన్ రాజధాని జుబాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం కుప్పకూలిన ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. సిటీలింక్ ఏవియేషన్ సంస్థకు చెందిన సెస్నా 208 కారవాన్ అనే విమానం జుబా నగర శివారులో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విమానం యే నుంచి జుబా విమానాశ్రయానికి చేరుకుంటుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఏప్రిల్ 27 ఉదయం 9 గంటల 15 నిమిషాలకు బయల్దేరిన విమానం 9 గంటల 43 నిమిషాలకు రాడార్ తో సంబంధాలను కోల్పోయింది.

PlaneCrash Near Juba South Sudan 14 People Killed in Tragic Incident 20 Km from Capital SouthSudan

ప్రతికూల వాతావరణం, పొగమంచు కారణంగా విమానం కుప్పకూలినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం తర్వాత విమానం మంటల్లో దగ్దమైనట్లు చెబుతున్నారు. మరోవైపు దక్షిణ సుడాన్ పౌర విమానయాన సంస్థ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తోంది. మృతి చెందిన ప్రయాణికుల్లో 12 మంది దక్షిణ సుడాన్ కు చెందినవారు కాగా.. మిగిలిన ఇద్దరు కెన్యా జాతీయులని తెలుస్తోంది. ఇటీవలికాలంలో దక్షిణ సుడాన్ లో విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+