టాలీవుడ్‌లో సమంత రేంజ్ ఇది.. దెబ్బకు అరుంధతి రికార్డు అవుట్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలకు థియేటర్లలో ఏ స్థాయి ఆదరణ ఉంటుందో ఈ చిత్రం మరోసారి నిరూపించింది. ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా.. కుటుంబ ప్రేక్షకుల మద్దతుతో పాటు రిపీట్ అభిమానుల కారణంగా రెండో వీకెండ్‌లోనూ అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.

బాక్సాఫీస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదలైన 9వ రోజున భారత్‌లో రూ.4.90 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే 12.6 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. దీనితో ఈ సినిమా మొత్తం దేశీయ నెట్ వసూళ్లు రూ.42.95 కోట్లకు చేరుకున్నాయి. అలాగే దేశీయంగా గ్రాస్ వసూళ్లు రూ.49.72 కోట్ల మార్కును దాటాయి. శనివారం వచ్చిన నెట్ కలెక్షన్లలో కేవలం తెలుగు వెర్షన్ నుంచే రూ.4.95 కోట్లు రావడం విశేషం.

Samantha Maa Inti Bangaram Breaks Anushka 16-Year-Old Arundhati Box Office Record Full Details

ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లోనూ గట్టి ప్రభావం చూపుతోంది. 9వ రోజున విదేశీ మార్కెట్ల నుంచి ఈ సినిమా అదనంగా రూ.1.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనితో మొత్తం అంతర్జాతీయ గ్రాస్ కలెక్షన్లు రూ.21.85 కోట్లకు చేరుకున్నాయి. వెరసి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అత్యంత లాభదాయకమైన రూ.71.57 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ గ్లోబల్ కలెక్షన్లతో 'మా ఇంటి బంగారం' సినిమా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన 16 ఏళ్ల నాటి చారిత్రాత్మక చిత్రం 'అరుంధతి' రికార్డును అధికారికంగా బద్ధలు కొట్టింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక సోలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా ఇది సరికొత్త చరిత్ర లిఖించింది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు వీక్ డేస్‌లో కలెక్షన్లు తగ్గుతుంటాయి. కానీ ఈ సినిమా మొదటి రోజు రూ.5.35 కోట్ల నెట్‌తో నెమ్మదిగా ప్రారంభమై.. పాజిటివ్ టాక్ కారణంగా మొదటి ఆదివారం నాటికే రూ.10.10 కోట్ల నెట్ వసూళ్లతో అనూహ్య వృద్ధిని సాధించింది.

విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా ఈ సినిమా నుంచి బిజినెస్ చేసి సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం థియేటర్లలో వస్తున్న వసూళ్లన్నీ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. సమంత కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సోలో చిత్రంగా 'మా ఇంటి బంగారం' నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+