ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్!

దక్షిణాది సినీ పరిశ్రమలో చందమామలా వెలిగిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు తెరలేపాయి. రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఈ బ్యూటీ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సెన్సేషనల్ సీక్రెట్‌ను బయటపెట్టింది. అయితే ఆమె సగం చెప్పి.. సగం దాచిన ఆ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు పెద్ద పజిల్ లా మారింది. ఒక టాక్ షోలో పాల్గొన్న కాజల్‌కు యాంకర్ నుండి "ఇండస్ట్రీలో ఎవరైనా మీకు ప్రపోజ్ చేశారా?" అనే ప్రశ్న ఎదురైంది.

దానికి ఆమె కంగారుపడకుండా మొదట గుంభనంగా నవ్వి, కొద్దిసేపు మౌనం వహించి.. అవునన్నట్లుగా తల ఊపింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్టార్ హీరో తనకు ప్రేమను వ్యక్తపరిచాడని, కానీ ఆ సమయంలో ఆ ప్రపోజల్‌ను తాను తిరస్కరించానని కాజల్ ఒప్పుకుంది. అప్పట్లో అది సరైన నిర్ణయం కాదని నా మనసుకు అనిపించింది, అందుకే ఒప్పుకోలేదు అంటూ ఆ హీరో పేరు చెప్పకుండా టాపిక్ క్లోజ్ చేసింది.

'ఫౌజీ' రిలీజ్‌ డేట్ ఇదే..? ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..!
'ఫౌజీ' రిలీజ్‌ డేట్ ఇదే..? ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే..!
Prabhas Did Rebel Star Propose to this star heroine- check out the details

ఆ హీరో ఎవరై ఉంటారు?

ఈ చిన్న క్లూతో సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు ఆ హీరో ఎవరై ఉంటారా? అనే వేట మొదలుపెట్టారు. కాజల్ తన కెరీర్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్, సూర్య, రామ్ చరణ్, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే నెటిజన్ల ఊహాగానాల్లో ప్రధానంగా ఇద్దరు హీరోల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. 'మగధీర' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు కాబట్టి ఆ సమయంలోనే రామ్ చరణ్ ఆమెకు ప్రపోజ్ చేసి ఉంటాడని కొందరు ఫ్యాన్స్ గట్టిగా వాదిస్తున్నారు. మరికొందరేమో 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాల సమయంలో ప్రభాస్ ఆమె ప్రేమలో పడ్డాడని.. కాజల్ రిజెక్ట్ చేయడం వల్లే ప్రభాస్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

చిక్కుల్లో ప్రభాస్
చిక్కుల్లో ప్రభాస్

ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా?

అయితే ఇవన్నీ కేవలం అభిమానుల అంచనాలు మాత్రమేనని, కెరీర్ ఆరంభంలో ఆమెతో నటించిన మరేదైనా నటుడు కూడా అయి ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఏది ఏమైనప్పటికీ, కాజల్ మాత్రం 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడి, ఒక బాబుకు జన్మనిచ్చి, అటు ఫ్యామిలీ లైఫ్‌ను ఇటు కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీగా సాగిపోతోంది. కానీ ఆమె తిరస్కరించిన ఆ 'మిస్టరీ హీరో' ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి టాలీవుడ్‌లో ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నే!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+