ఈ రోజు ఇరాన్ కు చుక్కలే.. చంపేస్తాం: ట్రంప్ సంచలనం

మధ్యప్రాచ్యంలో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ క్షమాపణలు చెప్పిన అనంతరం ట్రంప్ ఈ మేరకు ఇరాన్ కు వార్నింగ్ ఇస్తూ తన సొంత సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో కీలక పోస్టు పెట్టారు. ఇరాన్ మధ్య ప్రాచ్యంలో ఓడిపోయిన దేశంగా ట్రంప్ అభివర్ణించారు. ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం సందర్భంగా పొరుగు దేశాలపై జరిగిన దాడులకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈలపై శనివారం ఉదయం జరిగిన వరుస దాడుల అనంతరం ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పారు. ఆయా దేశాలపై దాడులు చేసే ఉద్దేశం లేదని వెల్లడించారు. వారు దాడి చేయకపోతే ఇరాన్ కూడా చేయదని స్పష్టం చేశారు. ఈ మేరకు గల్ఫ్‌ దేశాలపై దాడులు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పెజెష్కియాన్ ప్రకటనపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఇలా అన్నారు.. "ఘోరంగా దెబ్బతిన్న ఇరాన్ తన మధ్యప్రాచ్య పొరుగు వారికి క్షమాపణ చెప్పి లొంగిపోయింది. ఇకపై వారిపై కాల్పులు జరపబోమని హామీ ఇచ్చింది. ఈ హామీ అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా మాత్రమే ఇచ్చింది వారు మధ్య ప్రాచ్యాన్ని స్వాధీనం చేసుకుని పాలించాలని చూస్తున్నారు. వేల సంవత్సరాల చరిత్రలో మధ్యప్రాచ్య దేశాల పట్ల ఇరాన్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. వాళ్లు, 'అధ్యక్షుడు ట్రంప్‌ కు ధన్యవాదాలు' అని అన్నారు. నేను, 'మీకు స్వాగతం!' అని చెప్పాను."

Trump Reacts to Pezeshkian Apology Vows Iran Will Be Hit Very Hard with Escalated Strikes Soon

"ఈరోజు ఇరాన్‌కు చాలా గట్టి దెబ్బ తగులుతుంది! ఇరాన్ చెడు ప్రవర్తన కారణంగా, ఈ క్షణం వరకు లక్ష్యంగా పరిగణించని ప్రాంతాలు, ప్రజల సమూహాలను పూర్తిగా నాశనం చేసి, ఖచ్చితమైన మరణానికి గురిచేయాలని తీవ్రంగా పరిశీలిస్తున్నాము" అని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ తాజా వార్నింగ్ తో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+