హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ మాస్టర్ ప్లాన్‌..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం ప్రకటించారు. హర్మూజ్‌ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా చేర్చడానికి 'ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ను ప్రారంభిస్తున్నట్లు ఆయన ట్రూత్‌సోషల్‌లో తెలిపారు.

యుద్ధంలో భాగం కాని అనేక దేశాల నౌకలు జలసంధిలో చిక్కుకుపోవడంతో, తమ సాయాన్ని కోరిన ఆయా దేశాలకు అమెరికా బలగాలు మార్గనిర్దేశం చేయనున్నాయి. సిబ్బంది ఆహార, నిత్యావసరాల కొరతతో ఇబ్బందులెదుర్కొంటున్నందున.. ఈ మానవతా ప్రక్రియ సోమవారం ఉదయం (పశ్చిమాసియా కాలమానం ప్రకారం) మొదలవుతుందని తెలుస్తోంది.

us-president-trump-announces-project-freedom-hormuz-that-humanitarian-naval-aid-mission

ఈ చర్యను పూర్తిగా మానవతా కోణంలో చేపడుతున్నామని Donald Trump స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగించినా తగిన విధంగా ప్రతిస్పందిస్తామని, అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడడం అంతర్జాతీయ బాధ్యతగా ఆయన పేర్కొన్నారు.

ఇదే సమయంలో Iranతో సానుకూల చర్చలు కొనసాగుతున్నాయని, ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ఈ చర్చలు సఫలమైతే ప్రాంతీయ శాంతి స్థిరపడటమే కాకుండా, గ్లోబల్ ఆయిల్ సరఫరాపై ఉన్న అనిశ్చితి కూడా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు సర్దుబాటు కావడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా చేపట్టిన 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కేవలం నౌకల రక్షణ మాత్రమే కాకుండా, ప్రపంచ వాణిజ్యాన్ని సజావుగా కొనసాగించే కీలక అడుగుగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+