భారత్ కు భారీ ఊరట

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ విఘాతం తగిలింది. భారత్ సహా వివిధ దేశాలపై ఆయన విధించిన 10 శాతం టారిఫ్ కొట్టివేతకు గురైంది. ఇది ఫెడరల్ చట్టాలకు విరుద్ధమని అమెరికా అత్యున్నత ట్రేడ్ కోర్ట్ తేల్చి చెప్పింది. 10 శాతం టారిఫ్ విధిస్తూ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై తీర్పు ఇచ్చింది. ఈ టారిఫ్ చెల్లబోవని, అవి చట్టవిరుద్ధమైనవని కోర్టు ప్రకటించింది. దీంతో ట్రంప్ టారిఫ్ విధానానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

న్యూయార్క్‌లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌.. ఈ తీర్పు వినిపించింది. ఈ న్యాయస్థానానికి చెందిన ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ 2-1 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది. యూఎస్ కాంగ్రెస్ అధ్యక్షుడికి అప్పగించిన అధికారాలను ట్రంప్ అతిక్రమించారని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పు వల్ల దేశవ్యాప్తంగా టారిఫ్ వసూళ్లకు బ్రేక్ పడకపోవచ్చు.

US Trade Court Strikes Down Trump s 10 percent Global Tariffs Delivering Blow White House Strategy

ఈ పిటీషన్ దాఖలు చేసిన వాషింగ్టన్ కు చెందిన సుగంధ ద్రవ్యాల సంస్థ బర్లాప్ అండ్ బారెల్, బొమ్మల తయారీ సంస్థ బేసిక్ ఫన్.. అనే మూడు సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. కంపెనీలకు ప్రాతినిధ్యం వహించిన లిబర్టీ జస్టిస్ సెంటర్‌కు చెందిన న్యాయ నిపుణుడు జెఫ్రీ ష్వాబ్ ఈ పిటీషన్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ పిటీషన్ తో సంబంధం లేని ఇతర సంస్థలు ఇప్పటికీ కూడా టారిఫ్ ను చెల్లించాల్సి ఉంటుందా లేదా అనే విషయంపై అనిశ్చితి నెలకొందని అన్నారు.

గత ఏడాది దాదాపు ప్రతి దేశం నుండీ దిగుమతులపై ట్రంప్ అమలు చేస్తూ వస్తోన్న టారిఫ్ ప్రతిపాదనలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కోర్ట్ ఆఫ్ ట్రేడ్ నుంచి కూడా ఈ తాజా తీర్పు వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది.. ట్రంప్ టారిఫ్ విధానానికి ఎదురైన వరుస న్యాయపరమైన సవాళ్లలో ఒకటి. అమెరికా విధించిన ఈ సుంకాలు భారత్ పైనా ప్రభావం చూపాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రభావవంతమైన వీటి రేటు 18 శాతానికి తగ్గింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు దీన్ని కూడా రద్దు చేసింది.

గత ఏడాది ప్రభుత్వ తరఫు న్యాయవాదులు.. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉటంకించి, అమెరికా వాణిజ్య లోటు జాతీయ అత్యవసర పరిస్థితికి దారితీసిందని కోర్టులో వాదించారు. ఈ చట్టం ఆధారంగా టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా తాజా తీర్పుపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉంది. మొదట వాషింగ్టన్‌లోని యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ లో పిటీషన్ దాఖలు చేయొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+