ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) మొదలుపెట్టిన యుద్దం మూడు వారాలకు చేరుతోంది. అయినా ఇప్పటికీ యుద్దం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఇరువర్గాలూ భారీ నష్టాలు చవిచూస్తున్నా, యుద్దంతో సంబంధం లేని గల్ఫ్ దేశాలూ నష్టపోతున్నా యుద్దం ఆపేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్ధితి. మధ్యవర్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాల్ని సైతం ఇరువర్గాలు స్వాగతించడం లేదు. అందుకు బదులుగా తాడోపేడో తేల్చుకుంటామంటున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా తమ జాతీయ భద్రతా మండలి ఛీఫ్ అలీ లారిజానీని ఇజ్రాయెల్ దాడుల్లో కోల్పోయిన ఇరాన్ తాజాగా ప్రపంచ దేశాలకు కీలక హెచ్చరికలు చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభం యొక్క పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ తాకబోతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి (abbas Araghchi)హెచ్చరించారు. ఇరాన్‌పై యుద్ధం అన్యాయమైనదని యూరోపియన్, అమెరికా అధికారులతో సహా పెద్ద సంఖ్యలో గళాలు వినిపిస్తున్నాయని, అంతర్జాతీయ సమాజంలోని ఇతర సభ్యులు కూడా ఇదే బాటలో నడవాలని ఆయన కోరారు.

West Asia Crisis to Impact Everyone Warns Iranian FM Abbas Araghchi

ఇరాన్ వార్ కు వ్యతిరేకంగా అమెరికా ఉగ్రవాద నిరోధక దళం ఛీఫ్ జో కెంట్ రాజీనామాపై స్పందిస్తూ.. ఇతర పాశ్చాత్య దేశాల అధికారులూ ముందుకు రావాలన్నారు. ప్రపంచ దేశాలపై యుద్ధ ప్రభావం పరంపర ఇప్పుడే మొదలైందని సంపద, మతం లేదా జాతితో సంబంధం లేకుండా అందరినీ తాకుతుందని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ రాజీనామా ప్రకటన కాపీని జతచేశారు. ఇప్పటికే తమపై యుద్దానికి దిగిన అమెరికా-ఇజ్రాయెల్ పై ప్రపంచదేశాల ఒత్తిడి పెంచేందుకు వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్న ఇరాన్.. హార్ముజ్ జలసంధిని ఇందుకు కీలకంగా వాడుకుంటోంది. అలాగే గల్ఫ్ దేశాలపై దాడులకు దిగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+