మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కానుక.. ప్రతీ నియోజకవర్గం నుంచి ..

రాష్ట్రంలోని మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళాసాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే మహిళలకు అనేక పథకాలను అందించింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా మరో కీలక ముందడుగు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గంలోని మహిళలకు అద్దిరిపోయే వార్త తెలిపింది. రాష్ట్రంలో బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ప్రతీ నియోజకవర్గం నుంచి 1000 మందికి ఈ కుట్టుమిషన్లు ప్రభుత్వం అందజేయనుంది.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని మహిళల కోసం ఆరు గ్యారంటీల్లో అనేక పథకాలను ప్రకటించడంతో పాటుగా రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మహిళలను మరో భారీ కానుక ప్రకటించింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలోని బీసీ మహిళలకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గానికి 1000 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఇదే విషయంపై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గం నుంచి 1000 మంది అర్హులైన మహిళలకు ఈ కుట్టుమిషన్లు ప్రభుత్వం అందజేయనుందని ప్రకటించారు. ఈ మేరకు త్వరలోనే దరఖాస్తులను స్వీకరించి, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. మహిళలకు 100శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్లు ఇస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తుందని తెలిపారు.

Telangana Govt to Provide Free Automatic Sewing Machines to BCWomen 100 SubsidyAnnounced Telangana

ఇక రాష్ట్రంలోని మహిళల విద్య, ఉపాధిపై తమ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించిందని ఇటీవల మంత్రి సీతక్క స్పష్టం చేశారు. త్వ‌ర‌లోనే మ‌హిళా సంఘ స‌భ్యుల ఎడ్యుకేష‌న్ ప్రొఫైల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా సంఘ సభ్యుల్లో ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+