NRI News: అమెరికా రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థిని మృతి.. హేళనగా మాట్లాడిన
డాలర్ల మోజులో పడి వేల మంది యువత అమెరికా బాటు పడుతున్నారు. కానీ అక్కడ మన వారిని ఎంతో చులకనగా చూస్తారు. అయినా కూడా చాలా మంది యూఎస్ బాట పడుతున్నారు. తాజా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి పై చదువులు కోసం అమెరికా వెళ్లింది. ఆమె నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీలోని సీటల్ క్యాంపస్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. అయితే జహ్నవి ఈ ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
అందరు సాధారణ యాక్సిడెంట్ గా భావించారు. ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కానీ 8 నెలల తర్వాత జహ్నవి యాక్సిడెంట్ సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పోలీసు అధికారి జహ్నవి మృతిని హేళన చేస్తూ మాట్లాడారు. ఆమె ప్రాణాలకు విలువలేదని సీటెల్ పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ తన సహోద్యోగితో చెప్పాడు. ఆమె చనిపోయింది. సాధారణ వ్యక్తి అని డేనియల్ నవ్వుతూ మాట్లాడాడు.

అలాగే మళ్లీ నవ్వుతూ ఒక చెక్ రాయండి. పదకొండు వేల డాలర్లకు అని చెప్పాడు. ఆమె వయసు 26 ఏండ్లని, ఆమె ప్రాణాలకు విలువ లేదని నవ్వుతూ హెళనగా మాట్లాడాడు. పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ మరో పోలీస్ అధికారితో ఫోన్‌లో మాట్లాడిన ఈ సంభాషణ అతడి బాడీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఆడియో క్లిప్‌ను సీటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సోమవారం విడుదల చేసింది. దీంతో ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డేనియల్ తీరుపై ప్రజలు మండిపడుతున్నరాు.
పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సీటెల్ పోలీస్ శాఖ విచారణ చేస్తున్నట్లు ప్రకటించింది. జహ్నవి న్యాయం చేయాలని సోషల్ మీడియాలో భారతీయులు పోస్టులు పెడుతున్నారు. జస్టిస్ ఫర్ జహ్నవి అని నినాదిస్తున్నారు. భారతీయుల ప్రాణాలు అంటే అమెరికన్లకు లెక్క లేకుండా పోయింది. అయినా కూడా మనోళ్లు అమెరికా వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications