NRI News: ఎన్నారై బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేసి రూ.57 లక్షలు కాజేసిన నిందితులు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఖాతా కలిగి ఉన్న ఎన్నారై రమణదీప్ గ్రేవాల్ బ్యాంక్ ఖాతా నుండి రూ.57.60 లక్షల దుర్వినియోగానికి సంబంధించిన సైబర్ మోసం కేసును లుథియాన పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం నలుగురిని అరెస్టు చేసి మొత్తం రూ.25 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు, ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన కీలక నిందితుడు డుగ్రీలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ సుఖ్‌జిత్ సింగ్ గా గుర్తించారు.
ఇతను రూ.14 లక్షలకు తీసుకుని ఇతర నిందితులకు కీలకమైన ఖాతా సమాచారాన్ని అందించినట్లు పోలీసులు తెలిపారు.సెప్టెంబర్ 3న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫుల్లన్‌వాల్ బ్రాంచ్ మేనేజర్ పునీత్ సాహ్ని సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమ కస్టమర్లలో ఒకరైన NRIకి సంబంధించిన ఆన్‌లైన్ మోసం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబర్ 5న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 420, 120B, IT చట్టంలోని 66-C, 66D కింద కేసు నమోదు చేశారు.

తరీకెకు చెందిన స్నేహ గుప్తా, ఫరీదాబాద్‌కు చెందిన కిరణ్ దేవి అనే మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తులను దంద్రన్ రోడ్డులో నివాసం ఉంటున్న సుఖ్‌జిత్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీలేష్ పాండే, గ్రేటర్ నోయిడాకు చెందిన అభిషేక్ సింగ్, బీహార్‌కు చెందిన లవ్‌కుమార్‌గా గుర్తించారు. ఎన్‌ఆర్‌ఐ ఖాతా వివరాలను రూ.14 లక్షలకు విక్రయించడం ద్వారా బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ సుఖ్‌జిత్ ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తేల్చారు.
నిందితులు UKలో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐ రమణదీప్ గ్రేవాల్ ఖాతాను దుర్వినియోగం చేశారు. అతని లింక్ చేయబడిన మొబైల్ నంబర్ డిస్‌కనెక్ట్ అయింది. అది ఇతరులకు జారీ చేశారు. ఆ ఫోన్ నంబర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాతో అనుసంధానించారు. దీంతో నిందితులు బాధితుడి అకౌంట్ నంబర్ కూడా తెలిశాయి. దీంతో వారు సైబర్ మోససానికి పాల్పడ్డారు. నిందితులు OTPలను ఉపయోగించి NRI కస్టమర్ నెట్ బ్యాంకింగ్‌ను హ్యాక్ చేసి, లింక్ చేసిన ఇమెయిల్ చిరునామాను మార్చారు. లబ్ధిదారులను జోడించారు. నెట్ బ్యాంకింగ్ ద్వారా కొత్త డెబిట్ కార్డ్‌ను ఆర్డర్ చేశారు. చండీగఢ్‌కు చెందిన స్నేహ, ఫరీదాబాద్‌కు చెందిన కిరణ్ దేవి, నీలేష్ పాండే అనే వారి సహచరులు కలిగి ఉన్న మరో మూడు బ్యాంక్ ఖాతాలకు మొత్తం రూ.57 లక్షలు బదిలీ చేశారు.
నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా, మిగిలిన ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు చురుగ్గా గాలిస్తున్నట్లు పోలీసు కమిషనర్ మన్‌దీప్ సింగ్ సిద్ధూ తెలిపారు. అరెస్టుల సమయంలో పోలీసులు నిందితుల నుంచి రూ. 17.35 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లోని రూ. 7.24 లక్షల మొత్తాన్ని స్తంభింపజేశారు. అంతేకాకుండా, ఆపిల్ మ్యాక్‌బుక్, నాలుగు మొబైల్ ఫోన్లు, ఎనిమిది ఎటిఎం కార్డులు, మూడు చెక్ బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications