NRI News: నిర్మాత అంజిరెడ్డి హత్యలో విస్తుపోయే నిజాలు..!

హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అయినా అతను హత్యకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులు చిక్కాడు. హైదరాబాద్ పద్మారావు నగర్ కి చెందిన జి. అంజిరెడ్డి గతంలో పలు సినిమాలు నిర్మించాడు. ఆయనకు ఇద్దురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఓ కొడుకు, బిడ్డ విదేశాల్లో స్థిరపడ్డారు. మరో కుమారుడు మోకిలాలో ఉంటున్నాడు. విదేశాల్లో ఉంటున్న కుమార్తె, కొడుకు వద్ద వెళ్లారు.

అక్కడే కొన్ని సంవత్సరాలు ఉంటున్నారు. దీంతో అంజిరెడ్డి దంపతులకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. అమెరికా సిటీజన్ షిప్ రావడంతో అక్కడే స్థరపడాలని నిర్ణయించుకున్నారు అంజిరెడ్డి. అంజిరెడ్డి 10 నెలల క్రితం ఇండియాకు వచ్చారు. ఆయన నిర్మాతగా ఉండగా.. సీనియర్ ఫొటోగ్రాఫర్ కాట్రగడ్డ రవితో ఆయనకు ఇంకా పరిచయం ఉంది. దీంతో అంజి రెడ్డి తన ఆస్తులు అమ్మాలని అనుకుంటున్నట్లు రవి చెప్పారు.

producer Anji Reddy

రవి ఇదే విషయాన్ని రియాల్టర్ల వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నెల క్రితం అంజిరెడ్డి దంపతులు ఇండియాకు వచ్చారు. రవి జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ను అంజిరెడ్డి పరిచయం చేశాడు. దీంతో అంజిరెడ్డి, రాజేష్ మధ్య పరిచయం పెరిగింది. పద్మారావు నగర్ లోని ఇంటిని కొనుగోలు చేస్తానని అంజిరెడ్డి చెప్పారు. అది పాత ఇల్లు అయినా దాన్ని కూలగొట్టకుండా అందంగా తీర్చిదిద్దుతానని చెప్పేవాడు. ఇదంతా అంజి రెడ్డి దంపతులు నమ్మారు.

సైదాబాద్ లో ఉన్న మరో స్థాలన్ని విక్రయించాలని అంజిరెడ్డి చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న రాజేష్ తన వద్ద స్థలం కొనుగోలు చేసే పార్టీ ఉందని చెప్పారు. ఇంతలోనే అంజి రెడ్డి దంపతులు ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. అయితే భూములు అమ్మడానికి సమయం పడుతుండడంతో భార్యను పంపాడు. అంజిరెడ్డిని మోసం చేయడానికి ఇదే సరైన సమయం అని రాజేష్ భావించాడు. అంజిరెడ్డికి రెండు దశల్లో రూ.2.1 కోట్లు నగదు చెల్లించిన డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు.

అంజిరెడ్డిని రాజేష్‌ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు జీఆర్‌ కన్వెన్షన్‌ ఉన్న డీమార్ట్‌ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లాడు. బేస్‌మెంట్‌- 3లో అంజిరెడ్డి కారు పార్క్‌ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు కొడుకు చరణ్‌కు ఫోన్‌ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్‌ అయిందని సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్‌, అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+