ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు, ఎందుకంటే?
గల్ఫ్ దేశాల్లో నేరాలకు తీవ్రమైన శిక్షలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరు భారతీయులకు యూఏఈ ఉరిశిక్ష అమలు చేసింది. యూఏఈలో హత్యలకు పాల్పడ్డారంటూ ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలు చేసినట్లు భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సమాచారాన్ని వారి కుటుంబాలకు తెలియజేసింది.
మరణశిక్షకు గురైనవారిని మహమ్మద్ రినాష్ అరింగిలొట్టు, మురళీధరన్ పెరుమ్తట్టు వలప్పిల్‌గా గుర్తించారు. వీరిద్దరూ కూడా కేరళ రాష్ట్రానికి చెందినవారే. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ యూఏఈ వాసి హత్య కేసులో మహమ్మద్ రినాష్ దోషిగా తేలాడు. ఇక, ఓ భారతీయుడిని హత్య చేసిన కేసులో మురళీధరన్ దోషిగా తేలడంతో వీరికి ఉరిశిక్షలు అమలు చేశారు.

అయితే, వీరిద్దరికి అవసరమైన దౌత్య సహాయం అందజేసినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇది ఇలావుండగా, ఇటీవలే యూఏఈ జైల్లో భారతీయ మహిళ షెహజాది ఖాన్‌కు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విషయం కూడా రెండు రోజుల క్రితమే వెల్లడైంది.
ఓ హత్య కేసులో షెహజాదికి అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. దాదాపు ఏడాదిపాటు ఆమె న్యాయపోరాటం చేసిన ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 15వ తేదీనే సెహజాదిని ఉరితీశారు. అయితే, ఆ విషయాన్ని
మాత్రం చాలా ఆలస్యంగా రెండు రోజుల క్రితం చేరవేశారు.












Click it and Unblock the Notifications