రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన యంగ్ బ్యూటీ.. డైరెక్టర్ కాదు.. ఆ నటుడితో ??
యంగ్ బ్యూటీ బ్రిగిడా సాగా.. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. కోలీవుడ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. టీవీ సీరియల్ ఆహా కళ్యాణంలో పవి టీచర్ గా బాగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా 2019లో "అయోగ్య" సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మాస్టర్, ఇళవిన్, గరుడన్, మార్గన్, ఇడ్లీ కడై, హాట్ స్పాట్ టూ మచ్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
అంతే కాకుండా ఈ అమ్మడుకు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. సింధూరం, పెదకాపు చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈమె తెలుగులో ఓ దర్శకుడితో ప్రేమలో ఉందని గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో ఆ దర్శకుడు తెరకెక్కించిన మూవీలో ఆమె నటించిందని.. ఈ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని అంటున్నారు. దాంతో అప్పటి నుంచి వారి మధ్య రిలేషన్ ఉందని.. ఇప్పటికే చెన్నైలో వారు కలిసి ఉంటున్నారని టాక్ నడిచింది. ఆ కారణంగానే సదరు డైరెక్టర్ కి.. అతని భార్యకి గొడవలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది ఈ భామ.

అతనితో లవ్..
సోషల్ మీడియా వేదికగా తన ప్రేమ సంగతి బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. యంగ్ హీరో ఆనంద్ రామ్ తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు.. ఆనంద్ రామ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ సుధీర్ఘ పోస్ట్ చేసింది. అందులో.. చిన్నప్పుడు, అత్యంత అందమైన ప్రేమకథలు కేవలం సినిమాల్లోనే ఉంటాయని నేను నమ్మేదాన్ని. సినిమా పూర్తయి, తెరపై పేర్లు పడిపోయిన తర్వాత కూడా మనసులో అలాగే నిలిచిపోయే కథలవి. కానీ జీవితం మరోలా ప్లాన్ చేసింది. సినిమా రంగంలో నా ప్రయాణంలో, నాలాంటి కలనే కంటూ, దాన్ని అంతే గౌరవించే ఒక వ్యక్తి నాకు పరిచయమయ్యారని రాసుకొచ్చింది.
అలానే అత్యంత అందమైన ప్రేమకథలు ఎప్పుడూ కేవలం తెర కోసం మాత్రమే రాయబడవు అని నాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. కొన్నిసార్లు, అవి నిజ జీవితంలోనే అందంగా సాగుతాయి. ఇదిగో, మా ప్రపంచంలోని ఒక చిన్న భాగం మీ కోసం. మేము ఎప్పుడూ "ఐ లవ్ యూ" (I love you) అని చెప్పుకునే రకం కాదు. ఆ ప్రయాణంలో ఎక్కడో ఒకచోట, ఆ మాటలు మరోలా మారిపోయాయి. "LovveeSe" (లవ్-ఈ-సీ). ఇది కేవలం మాకు మాత్రమే సొంతమైన పదం. ఈ రోజు, మా ప్రపంచంలోని ఆ చిన్న భాగాన్ని మీతో పంచుకుంటున్నాము అంటూ పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications