AP EAPCET Results: చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్. కొత్త డేట్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఎప్‌సెట్‌ (AP EAPCET 2026) ఫలితాల విడుదలలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మరికొద్ది గంటల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కావాల్సిన ఈ ఫలితాలు చివరి నిమిషంలో అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఈ సడన్ డెసిషన్‌తో విద్యార్థుల్లో టెన్షన్ ఒక్కసారిగా రెట్టింపయింది. ఫలితాలను ఎల్లుండి అంటే జూన్ రెండో తేదీ (గురువారం) ప్రకటించే అవకాశముందని ఉన్నత విద్యామండలి వర్గాల సమాచారం.

రాష్ట్రంలో మొత్తం 3.29 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది మే 12 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన ఎప్‌సెట్ పరీక్షలు రాశారు. ఈ పరీక్షల ఫలితాలను నిజానికి జూన్ 1నే విడుదల చేయాల్సి ఉంది. అయితే, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి రీవెరిఫికేషన్ ఫలితాలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు.

AP EAPCET Results 2026 Officially Postponed Minister Nara Lokesh to Release on Thursday
Inter Practical మార్కుల్లో కొత్త మార్పులు.. వారానికి 2 రోజులు ల్యాబ్ తప్పనిసరి!
Inter Practical మార్కుల్లో కొత్త మార్పులు.. వారానికి 2 రోజులు ల్యాబ్ తప్పనిసరి!

చివరికి అన్ని అడ్డంకులు తొలగిపోయి నేడే ఫలితాలు విడుదలవుతాయని పరీక్ష నిర్వహించిన కాకినాడ జేఎన్టీయూ (JNTU) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ, సీబీఎస్ఈ ఫలితాల ప్రక్రియ ఇంకా పూర్తి కానందున, విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఉన్నత విద్యామండలి చివరి క్షణంలో ఈ గురువారానికి వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

CSE గ్రూపులకే ఫుల్ డిమాండ్! TG EAPCET వెబ్ ఆప్షన్లు షురూ..
CSE గ్రూపులకే ఫుల్ డిమాండ్! TG EAPCET వెబ్ ఆప్షన్లు షురూ..

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

గురువారం ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • మొదట అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx) లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో కనిపించే 'AP EAPCET 2026 Results' లింక్‌పై క్లిక్ చేయాలి.
  • వెంటనే ఓపెన్ అయ్యే కొత్త విండోలో విద్యార్థి తన హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  • వివరాలు సబ్మిట్ చేయగానే మీ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి, ఎందుకంటే కౌన్సిలింగ్ సమయంలో ఈ స్కోర్ కార్డ్ అత్యంత కీలకం కానుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+