Inter Practical మార్కుల్లో కొత్త మార్పులు.. వారానికి 2 రోజులు ల్యాబ్ తప్పనిసరి!

ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇకపై కేవలం టెక్స్ట్‌ బుక్స్ ల్లోని బొమ్మలు చూసి, పాఠాలను బట్టీ పట్టి మార్కులు తెచ్చుకుంటామంటే కుదరదు. సైన్స్ సబ్జెక్టుల్లో కేవలం థియరీ నాలెడ్జ్‌కే పరిమితం కాకుండా, విద్యార్థులకు క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మక జ్ఞానాన్ని అందించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ ప్రథమ సంవత్సరం (ఫస్టియర్) విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిశ్చయించింది. కేవలం సెకండ్ ఇయర్ లోనే కాకుండా, విద్యార్థి కాలేజీలో అడుగుపెట్టిన మొదటి ఏడాది నుంచే సైన్స్ ప్రయోగాలపై పట్టు సాధించాలనేది బోర్డు సంకల్పం. దీనికి సంబంధించిన సమగ్ర విధివిధానాలతో కూడిన మాన్యువల్‌ను మరో 15 రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ వెల్లడించారు.

కార్పొరేట్ కాలేజీల 'థియరీ' మాయాజాలానికి చెక్!

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,339 ఇంటర్ కాలేజీలు ఉండగా, అందులో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సుమారు 7 లక్షల మంది విద్యార్థులు సైన్స్ గ్రూపులకు చెందినవారే కావడం గమనార్హం. వాస్తవానికి సైన్స్ విద్యార్థుల వీక్లీ షెడ్యూల్‌లో ప్రాక్టికల్స్‌కు పీరియడ్లు కేటాయించినప్పటికీ, చాలా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు వాటిని తుంగలో తొక్కేస్తున్నాయి. ల్యాబ్స్ వైపు విద్యార్థులను తీసుకెళ్లకుండా ఆ సమయాన్ని కూడా థియరీ క్లాసులకే వాడుకుంటూ సిలబస్ పూర్తి చేయడంపైనే దృష్టి పెడుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మరికొన్ని కాలేజీలైతే సెకండియర్ చివరి రోజుల్లో నామ్‌కేవాస్తేగా ప్రాక్టీస్ చేయించి చేతులు దులుపుకుంటున్నాయి.

TG Inter Board Update Practical Exams Mandatory for First Year Students to Boost Conceptual Learning

ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్ బోర్డు సరికొత్త టైమ్ టేబుల్‌ను సిద్ధం చేస్తోంది. క్లాసు రూములో థియరీ పాఠం విన్న అదే వారంలోనే, విద్యార్థులు ల్యాబ్‌లోకి వెళ్లి దానికి సంబంధించిన ప్రయోగాన్ని స్వయంగా చేసి చూసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాలేజీల్లోని సెక్షన్లు, స్టూడెంట్స్ సంఖ్యను బట్టి వారానికి కనీసం రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ల్యాబ్ సెషన్లు నిర్వహించడం ఇకపై తప్పనిసరి కానుంది.

ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అవుట్! మార్కులు పెరిగాయా?
ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అవుట్! మార్కులు పెరిగాయా?

మార్కుల కేటాయింపులో కొత్త మార్పులు ఇవే:

ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మార్కుల విభజనను కూడా బోర్డు ఖరారు చేసింది.

  • ఎంబీసీ (MPC) గ్రూప్: మొత్తం 60 ప్రాక్టికల్ మార్కుల్లో, సగం మార్కులను (30 మార్కులు) ఫస్టియర్‌కు కేటాయించారు.
  • బైపీసీ (BiPC) గ్రూప్: మొత్తం 120 ప్రాక్టికల్ మార్కుల్లో, సగం మార్కులను (60 మార్కులు) ఫస్టియర్‌కు కేటాయించారు.
  • గణితం (Mathematics): ఈ ఏడాది నుంచి మ్యాథ్స్ సబ్జెక్టుకు కూడా ఇంటర్నల్ మార్కులు ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది.

కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 'లైవ్' నిఘా!

కాలేజీల యాజమాన్యాలు బోర్డు రూల్స్ పాటిస్తున్నాయా? లేదా? అని తెలుసుకోవడానికి అధికారులు అధునాతన సాంకేతికతను వాడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కాలేజీల్లోని సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డుకు చెందిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నారా? లేదా? అనే అంశాలను అధికారులు లైవ్‌లో నిరంతరం మానిటర్ చేయనున్నారు. ఒకవేళ ఏ కాలేజీలోనైనా ప్రాక్టికల్స్ నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తే, సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా సదరు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు బోర్డు సిద్ధమైంది. చిన్న చిన్న గదుల్లో కాలేజీలు నడుపుతూ కనీస ల్యాబ్ సౌకర్యాలు కల్పించని విద్యాసంస్థల గుర్తింపుపై కూడా కఠినంగా వ్యవహరించనున్నారు.

CSE గ్రూపులకే ఫుల్ డిమాండ్! TG EAPCET వెబ్ ఆప్షన్లు షురూ..
CSE గ్రూపులకే ఫుల్ డిమాండ్! TG EAPCET వెబ్ ఆప్షన్లు షురూ..

విద్యార్థులకు జాతీయ స్థాయి పరీక్షల్లో వరం!

ఇంటర్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని సబ్జెక్టు నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బట్టీ విధానం వల్ల విద్యార్థులకు సబ్జెక్టుపై లోతైన అవగాహన రావడం లేదని, అదే స్వయంగా ల్యాబ్‌లో ప్రయోగాలు చేయడం వల్ల సబ్జెక్టు మూలాల్లోకి వెళ్లవచ్చని పేర్కొంటున్నారు. ఈ ప్రయోగాత్మక విద్యా విధానం కేవలం ఇంటర్మీడియట్ మార్కుల కోసమే కాకుండా.. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ (NEET), జేఈఈ (JEE) వంటి కఠినమైన పోటీ పరీక్షల్లో మెరుగైన ర్యాంకులు సాధించడానికి విద్యార్థులకు ఒక బలమైన పునాదిగా మారుతుందని తల్లిదండ్రులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+