రైతులకు శుభవార్త.. రైతు భరోసా నిధుల విడుదల నేడే!

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి శుభవార్త. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా అందటానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. రైతులకు పంట పెట్టుబడి సహాయంగా అందించే రైతు భరోసా పథకం కింద మొదటి విడత నిధులు నేడు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక సాక్షిగా రైతు ఆశీర్వాద సభను నిర్వహించి నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు.

రైతుల ఖాతాల్లో రూ.2,482.02కోట్లు జమ

ప్రభుత్వ ప్రకటన ప్రకారం, రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 41.37లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02కోట్లు జమ చేయనున్నారు. ఈ మొత్తం రైతుల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. మొత్తం 73.32 లక్షల మంది రైతులకు ఒక్కొక్క ఎకరానికి రూ.6,000 చొప్పున సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దశలవారీగా నిధులు విడుదల చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Rythu bharosa farmers investment rythu bharosa funds to be credited today into farmers accounts

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిధుల విడుదల

ముందుగా ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలోని చింతకాని వద్ద రైతు ఆశీర్వాద సభను ప్రతిపాదించారు. అయితే భారీవర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి, హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మార్చారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి ల్యాప్‌టాప్ ద్వారా బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం

ప్రభుత్వం ఈ నిధుల విడుదలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ మరియు అన్ని బ్యాంకులకు ముందస్తుగా సమాచారం అందించింది. రైతుల రుణ బకాయిలను మినహాయించకుండా పూర్తి మొత్తం ఖాతాల్లో జమ చేయాలని బ్యాంకులను సూచించింది. ఇది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తుంది. ఖరీఫ్ సీజన్ సమయంలో ఈ నిధులు అందడం రైతులకు పెద్ద బలంగా చెప్పవచ్చు.

తెలంగాణలో జులై 4వరకు ఈ జిల్లాలకు భారీవర్షాల హెచ్చరిక!
తెలంగాణలో జులై 4వరకు ఈ జిల్లాలకు భారీవర్షాల హెచ్చరిక!

రైతు భరోసా నిధుల విడుదలతో రైతులలో సంతోషం

పంటల సాగు, విత్తనాలు, ఎరువులు, యంత్రాలు వంటి అవసరాలకు ఈ సాయం ఉపయోగపడుతుంది. నేడు సాయంత్రం నుండి రైతుల ఖాతాలలో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ కానున్న నేపధ్యంలో రైతులలో సంతోషం కనిపిస్తుంది. ఈ డబ్బులు వ్యవసాయానికి దోహదం అవుతాయి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+