అక్రమాలన్నీ నిరూపిస్తాం: నారాయణపై జగన్ పార్టీ ఎమ్మెల్యే అనిల్

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి నారాయణపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి నారాయణ అక్రమాలన్నీ నిరూపిస్తామని తెలిపారు.

నెల్లూరు నగర అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నారాయణను ప్రశ్నిస్తే ఆయన తమపైఆరోపణలకు దిగడం సరికాదన్నారు. నెల్లూరు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో తన పనితనం చూడాలని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

 Anil Kumar Yadav fires Minister Narayana

పొట్టీ శ్రీరాములకు భారతరత్న ఇవ్వాలి

పొట్టి శ్రీరాములు 62వ వర్ధంతిని పురస్కరించుకుని ఆత్మకూరు బస్టాండు ప్రాంతంలో ఉన్న ఆయన విగ్రహానికి డిఫ్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ప్లోర్‌లీడర్ రూప్‌కుమార్ యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే అనిల్ సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఎనిమిది కోట్ల ఆంధ్రుల కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీపొట్టిశ్రీరాములుకు ‘భారతరత్న' ఇవ్వాలని సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ తెలిపారు. తెలుగు వారి కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవికి భారతరత్నతో గౌరవించినప్పుడే ఆ మహా నేతకు ఘననివాళి అన్నారు.

అమరజీవికి భారతరత్న ఇవ్వాలని కోరుతూ.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుస్తామన్నారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఆంధ్రరాష్ర్టం నుంచి తెలంగాణా విడిపోయిం దే కాని ఆంధ్రరాష్ట్రం విడిపోలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+