వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొట్ట పెరిగిపోవడాన్ని చూసి ఆందోళన చెందుతున్నారా..అయితే ఈ యోగాసనాలు చేయండి..!!

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

ఆధునిక కాలంలో మనిషికి శారీరక శ్రమ లేకపోవడం, తినే ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోవడం మూలానా పొట్ట భాగం పెరిగిపోతుంది. ఫిట్ నెస్...ఫిట్ నెస్ అంటూ పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో వేధిస్తున్న సమస్యల్లో పొట్ట దగ్గర పేరుకుపోతున్న కొవ్వు కూడా ఒకటి. అయితే యోగాసనాల ద్వారా ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు. వేడినీళ్లను తాగితే మీ పొట్ట వెన్నలా కరిగిపోతుంది. రోజుకు 2 ఔన్సుల నారింజ రసం తాగడం వల్ల శరీరంలో జరుగుతుంది. ఈ క్రమంలో పొట్టతగ్గడానికి ఉపకరించే కొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాం.

* కపాలభాతి:- కఫాలం అంటే పుర్రె. భాతి అంటే ప్రకాశించడం అని అర్ధం. మనం తీసుకున్న గాలి మెదడుకు ఎక్కువగా చేరి, అక్కడున్న కేంద్రాలన్నీ ప్రకాశవంతమవుతాయి. అలాగని ఇది ప్రాణాయామం కాదు. ఇది ఒక క్రియ. కపాలభాతి వల్ల మన శరీరంలో అణువణువుకీ ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇంకా ఈ ఆసనం వేసేటప్పుడు పొట్టను ముందుకు, వెనుకకు కదలించడం వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు చాలా తొందరగా తగ్గుతుంది.

Are you suffering from heavy belly, then Know the important Yogasanas to reduce the belly

ముందుగా వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి, ముక్కు రంధ్రాల ద్వార శ్వాసని బలంగా బయటకు వదలాలి. అలా గాలిని బయటకు వదిలేటప్పుడు లోపల నుంచి కాకుండా ముక్కు రంధ్రాల చివర నుంచి వదలాలి. కేవలం గాలిని బయటకు వదలడంపైనే మీ దృష్టి పెట్టాలి. తర్వాత మెల్లగా శ్వాసతీసుకోండి. శ్వాస బయటకు విడిచిపెట్టిన ప్రతిసారీ పొట్టని లోపలికి లాగుతూ ఉండాలి. ఇలా సెకనుకు ఒకటి చొప్పున చెయాలి. ఇలా చేసేటప్పుడు ముఖ కండరాలు, ఛాతీ, భుజాలు మెడ బిగించకూడదు. ఇలా 300సార్లు చేయ్యాలి .

* అగ్నిసార :- ముందుగా నిటారుగా నిల్చుని రెండు పాదాల దూరంగా ఉంచాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ... బయటకు వదిలేస్తూ రెండు మోకాళ్లనూ కాస్త వంచాలి. ఆ తర్వాత రెండు చేతులనూ రెండు మోకాళ్లకు కొంచెం పైన పెట్టాలి. శ్వాస పూర్తిగా వదిలిన తర్వాత మళ్ళీ వెంటనే శ్వాస తీసుకోకుండా అలానే ఉంటూ పొట్టను ముందుకు, వెనుకకు కదిలించాలి. అలా ఎన్నిసార్లు కదిలించగలిగితే అన్ని సార్లు చేయాలి. తర్వాత శ్వాసతీసుకుంటూ మెల్లగా యథాస్థితికి వచ్చి నిలబడాలి. తర్వాత మళ్లీ ఇదే విధంగా చేయాలి. ప్రారంభించిన మొదట్లో ఎక్కువసార్లు కదిలించలేరు. కానీ బాగా అభ్యాసం చేస్తే రోజురోజుకూ ఈ ఆసనం వేయడం సులభమవుతుంది. 10-50 సార్లు చేయవచ్చు. రోజుకు 5సెట్స్ లెక్కన చెయ్యాలి. ఉదయం సమయంలో ఈ ఆసనం వల్ల చాలా అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.

* ఉత్థాన పాదాసనం:- ముందుగా వెల్లకిలా పడుకుని రెండు చేతులూ శరీరానికి రెండు పక్కలా ఉండాలి. శ్వాసతీసుకుంటూ మెల్లగా రెండు కాళ్ళు పైకి లేపాలి. అలా 90డిగ్రీలు వచ్చే వరకూ లేపి, తర్వాత మెల్లగా 30డిగ్రాల వరకూ కిందకు తీసుకురావాలి. కాళ్లను పూర్తిగా నేలపై పెట్టకూడదు. అలా 30డిగ్రాలు వచ్చేలా కాళ్లు పెట్టాక ఆ భంగిమలో సెకన్లు అలానే ఉండాలి. మళ్లీ 30డిగ్రీల నుండి 90డిగ్రీలకు కాళ్ళు లేపాలి. ఇలా 10నుంచి 20సార్లు కాళ్లు పూర్తిగా కింద పెట్టకుండా చేయాలి. అలాగే ఈ ఆసనంలో కాళ్ళు పైకి లేపే సమయంలో తల పైకి ఎత్తకూడదు.

ఈ ఆసనం మొదటి సారి చేసేప్పుడు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లే వేయాలి. తర్వాత రోజుకు కొంత సంఖ్య పెంచుతూ ఉండాలి. నడుము నొప్పి ఉన్నవారు రెండు చేతులూ శరీరానికి పక్కన కాకుండా నడుము క్రింది పెట్టుకుని చేయవచ్చు, ఈ ఆసనం వల్ల పొట్ట చాలా త్వరగా తగ్గుతుంది.

* నౌకాసనం :- ముందుగా వెల్లకిలా పడుకుని రెండు కాళ్లు, చేతులు, తల, భుజాలు మెల్లగా పైకి లేపాలి. తల, పాదాలు ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. శరీర బరువంతా పిరుదలపైన ఉండాలి. మీ ధ్యాస అంతా పొట్టపైనే పెట్టాలి. శ్వాస మామూలుగానే తీసుకుంటూ ఇదే స్థితిలో 20సెకన్లు ఉండాలి. ఇలా 6 సార్లు చేయాలి.

నౌకాసనం వేయడం వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు తగ్గడమే కాకుండా జీర్ణశక్తికి కూడా ఇది దోహదపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చక్కగా ఉపకరిస్తుంది.

* మకరాసనం:- ఈ ఆసనం వేసినపుడు చూసే వారికి మొసలి ముందుకు వస్తుంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది. అందుకే దీనికి మకరాసనం అని పేరు. ఈ ఆసనం వేయడానికి ముందుగా పొట్ట నేలకు ఆనించి బోర్లాపడుకోవాలి. రెండు కాళ్ళు దగ్గరకు పెట్టుకోవాలి. రెండు అరచేతులు ఒకదానిపై ఒకటి పెట్టి గడ్డం కింద పెట్టాలి. తల భుజాలు పైకి లేపాలి. కుడి మోకాలు పైకి మడిచి తల, భుజాలు ఎడమ పక్కకు తిప్పి శ్వాస వదులుతూ పక్కకు చూడాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ యధాస్థితికి అంటే మధ్యలోకి రావాలి. ఇప్పుడు కుడి కాలు కింద పెట్టి ఎడమ కాలితో ఇదే విధంగా కుడివైపుకు తిరిగి చేయాలి. మళ్లీ శ్వాస వదులుతూ యధాస్థితికి రావాలి. ఇలా కుడి, ఎడమ రెండుపక్కలా 20సార్లు చేయాలి. ఈ ఆసనం వేసేటప్పుడు తలను కింద పెట్టకూడదు.

మెడనొప్పి, నడుము నొప్పి సమస్యలున్నవారు ఈ ఆసనం వేయకూడదు. దీని ద్వారా పొట్టదగ్గర, నడుము దగ్గర ఉండే కొవ్వు తొందరగా తగ్గుతుంది. ఈ 5 ఆసనాలు కలిపి రోజూ అభ్యాసం చేస్తే పొట్ట దగ్గర ఉన్న కొవ్వును 20రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. రోజూ గంటల తరబడి వ్యాయామం చేస్తూ కిలోమీటర్లు పరుగులు పెట్టేకన్నా...ఇంట్లోనే ఒక అరగంట క్రమం తప్పకుండా చేస్తే పొట్టను తగ్గించుకోవచ్చు.

English summary
Doing Yoga daily keeps you healthy and your body fit. Thats why Yoga is practiced across the globe in these days. To reduce the belly there are few Aasanas that one needs to follow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X