టెక్కీల ఆశలపై నీళ్లు చల్లిన యాక్సెంచర్
మొన్నటి వరకు లేఆఫ్స్ తో టెక్కీలను వణికించిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్.. ఇప్పుడు మరో కొత్త మార్పునకు శ్రీకారం చుట్టింది. ఉద్యోగాల సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు తన పోర్ట్‌ఫోలియోలోని కొన్ని విభాగాల నుండి కూడా నిష్క్రమించనుండటం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగిస్తుందనే అంచనాలతో కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ పరిణామం- ఐటీ ఉద్యోగాలు బయట చెప్పుకొనేంత లగ్జరీతో కూడుకుని ఉన్నది కాదని స్పష్టమౌతోంది.
మొన్నటికి మొన్న లేఆఫ్స్ ప్రకటించింది యాక్సెంచర్. సంస్థకు అవసరమైన నైపుణ్యాల కోసం శిక్షణ ఇవ్వడం సాధ్యం కాని ఉద్యోగులను తొలగించబోతోన్నామనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తనకు ఉన్న మ్యాన్ పవర్ లో 11,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సుమారు 7,000 మందిని తొలగించింది యాక్సెంచర్ కూడా. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. మరిన్ని లేఆఫ్స్ ఉండొచ్చు.

ఈ పరిణామాల మధ్య మరో కీలక నిర్ణయం తీసుకుందా సంస్థ యాజమాన్యం. సీనియర్ ఉద్యోగుల ప్రమోషన్లు అప్రైజల్స్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రమోషన్లు పొందాలన్నా, అప్రైజల్స్ అందుకోవాలన్నా ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ ను ఎంత విస్తృతంగా వినియోగిస్తున్నారనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని యాక్సెంచర్ స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి బడా టెక్ కంపెనీలు కూడా ఇలాంటి ట్రెండ్‌ను అనుసరిస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది.
దీనిపై ఫైనాన్షియల్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అసోసియేట్ డైరెక్టర్లు, సీనియర్ మేనేజర్లకు పంపిన అంతర్గత ఈమెయిల్‌లో టీమ్ లీడర్లుగా ప్రమోషన్ పొందాలన్నా, దానికి అనుగుణంగా అప్రైజల్స్ తీసుకోవాలనుకున్నా AI టూల్స్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం తప్పనిసరి అని వెల్లడించింది. తమ పనిలో AIని ఉపయోగించని వారికి ప్రమోషన్లు లభించే అవకాశాలు చాలా తక్కువని యాక్సెంచర్ పరోక్షంగా సూచించింది.
AI ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో యాక్సెంచర్.. ఇప్పటికే 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. గత మూడేళ్లలోనే ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి పరిహార ప్యాకేజీల కోసం రెండు బిలియన్ డాలర్లు అంటే సుమారు 16,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఉద్యోగులు AI వినియోగాన్ని తప్పనిసరి చేయాలని సూచించిన మొదటి సంస్థ యాక్సెంచర్ కాదు. 2025 జూన్‌లో మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఏఐ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications