AI రీప్లేస్ చేయలేని టాప్ 5 హ్యూమన్ స్కిల్స్ ఏవో తెలుసా..!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తోంది. విద్య, ఆరోగ్యం, వినోదం, వ్యాపారం, టెక్నాలజీ అన్ని రంగాల్లో ప్రతి చోటా AI తన ముద్ర వేసింది. యంత్రాలు పనులకు వేగాన్ని అందించినప్పటికీ.. కీలకమైన నిర్ణయాలు మాత్రం ఇప్పటికీ మానవ మేధస్సే తీసుకుంటోంది. ఈ కొత్త శకంలో ప్రధాన ప్రశ్న "AI ఎంత వేగంగా పని చేస్తుంది?" అనేది కాదని.. "మానవ నైపుణ్యాలను ఈ యంత్ర యుగంలో ఎలా కాపాడగలమనే అంటున్నారు."
ఆటోమేషన్ వేగం..
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో జరిగిన మార్పులు AI ప్రభావానికి స్పష్టమైన సంకేతాలుగా చెప్పవచ్చు. అమెజాన్ 30,000 కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించడానికి సిద్ధమవుతుండగా.. పారామౌంట్ మరియు స్కైడాన్స్ వంటి సంస్థలు కూడా 1,000 మందిని తొలగిస్తున్నాయి. ఈ తొలగింపులు కేవలం తాత్కాలిక మార్పులు కావని.. ఉద్యోగ రంగంలో కొత్త శకం ప్రారంభమైందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365లో Copilot వంటి AI సాధనాలను ప్రవేశపెట్టిన తరువాత ఉత్పాదకత రాత్రికి రాత్రే పెరిగిపోయింది. ఈమెయిల్‌లు ఆటోమేటిక్‌గా రాయడం, స్లయిడ్‌లు ఆలోచనలను క్రమబద్ధీకరించడం, స్ప్రెడ్‌షీట్‌లు సెకన్లలో డేటా నమూనాలను గుర్తించడం వంటి పనులు సులభమయ్యాయి. అయితే AI వేగాన్ని ఇస్తుంది తప్ప లోతైన ఆలోచనను (Deep Thinking) అందించదని భావిస్తున్నారు. యంత్రాన్ని ఎప్పుడు నమ్మాలో, తమను తాము ఎప్పుడు నమ్మాలో తెలిసిన వారికే భవిష్యత్తు ఉంది" అని నివేదిక చెబుతోంది.
AI యుగంలో ఉద్యోగ రంగం వేగంగా మారుతోంది. LinkedIn టాలెంట్ ట్రెండ్స్ 2025 నివేదిక ప్రకారం.. AI అక్షరాస్యతతో పాటు మానవ తీర్పు (Human Judgement) కలిపిన ఉద్యోగ ప్రకటనలు 180% పెరిగాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ప్రకారం, సృజనాత్మకత (Creativity), విమర్శనాత్మక ఆలోచన (Critical Thinking), స్థితిస్థాపకత (Resilience) వంటి మూడు ప్రధాన నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్నాయి.
ముఖ్యంగా సృజనాత్మకత 2020లో 6వ స్థానం నుంచి 2025లో 1వ స్థానానికి ఎదగడం, AI యుగంలో మనుషుల అసలైన విలువను నిరూపిస్తోంది. MIT స్లోన్ మేనేజ్‌మెంట్ రివ్యూ అధ్యయనం ప్రకారం, టెక్నాలజీ మరియు మానవ సామర్థ్యాల రెండింటిలో సమానంగా పెట్టుబడి పెట్టిన సంస్థలు, ఆవిష్కరణలలో 33% మెరుగ్గా పనిచేస్తాయి.
AI కేవలం వచనాన్ని సృష్టించగలదు.. కానీ వినడం, అనుభూతి పంచుకోవడం, నమ్మకం ఇవ్వడం వంటి భావోద్వేగ మేధస్సు (Emotional Intelligence)ను అందించలేదు. 67% మంది CEOలు ఇప్పుడు EIని ప్రధాన నాయకత్వ లక్షణాలలో ఒకటిగా పేర్కొంటున్నారు. అలాగే AI ఆటోమేట్ చేయలేని అంశం Ethical Reasoning. గోప్యత, పక్షపాతం, సామాజిక ప్రభావం వంటి అంశాలు మానవ విలువలతో మాత్రమే నిర్ణయించబడతాయి.












Click it and Unblock the Notifications