ఆ మూడింటినీ భర్తీ చేసే తెలివి తేటలు AI కి లేవు.. రావు
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాలా రంగాలలో మనుషులను భర్తీ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మూడు రంగాలలో ఏఐ విజయవంతం కాలేదని ఆటోమేషన్ రీసెర్చర్ ఆడమ్ డార్ తెలిపారు. రీథింక్ ఎక్స్ లో పరిశోధనా విభాగం డైరెక్టర్ గా పని చేస్తోన్నారు.
ది గార్డియన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆడమ్ డోర్ మాట్లాడారు. 2045 నాటికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాలలో వేగంగా వస్తున్న మార్పుల కారణంగా చాలా ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని చెప్పారు. దాదాపు ప్రతి పనిని మానవుల కంటే యంత్రాలే మరింత సమర్థవంతంగా, వేగంగా, ఖచ్చితత్వంతో, తక్కువ ఖర్చుతో చేయగలుగుతున్నాయని తెలిపారు.

ఈ సాంకేతిక విప్లవం అనేది నెమ్మదిగా జరిగే మార్పు కాదని, చాలావేగంగా కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలు ఐటీ సంస్థలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకున్నాయని గుర్తు చేశారు. రాబోయే రెండు దశాబ్దాలలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రస్తుతం మనుషులు చేస్తున్న చాలా పనులను యంత్రాలే చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆయన పరిశోధనల ప్రకారం- ఒక కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత 15 నుంచి 20 సంవత్సరాలలో పాత వ్యవస్థలన్నీ దానితోనే భర్తీ అవుతాయి. ఇప్పుడు ఏఐ కూడా ఇదే మార్గంలో వెళుతోందని, ఈసారి యంత్రాలు నేరుగా మానవ శ్రమను భర్తీ చేస్తున్నాయని తేల్చి చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు చేస్తున్న వైట్ కాలర్ ఉద్యోగాలు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావానికి గురవుతాయని ఆడమ్ డార్ తెలిపారు. AI వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ దాదాపు ప్రతి రంగంలోనూ మానవుల కంటే మెరుగైన నాణ్యత, సామర్థ్యం, విశ్వసనీయతను అందిస్తాయని చెప్పారు.
కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ముప్పు ఉండకపోవచ్చని ఆడమ్ డార్ అంచనా వేశారు. ముఖ్యంగా భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం, నైతిక తీర్పులు ఇవ్వగలగడం, మానవ సంబంధాలపై ఆధారపడిన రంగాలను ఏఐ ప్రభావితం చేయదని అన్నారు.
ముఖ్యంగా రాజకీయం, సెక్స్ వర్కర్లు, ఎథిసిస్ట్ (ఎథిక్స్, విలువలు, భావోద్వేగాలకు సంబంధించిన రచనలు, కథనాలు రాసేవాళ్లు) వంటి ఉద్యోగాలను ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదని ఆడమ్ డార్ చెప్పారు. ఏఐ కారణంగా ఉద్యోగాలను కోల్పోయేవారందరికీ ఉపాధిని కల్పించడం అసాధ్యమని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
కొత్త ఆర్థిక విధానాలను వెంటనే అవలంభించకపోతే సమాజంలో అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని డార్ హెచ్చరించారు. మానవుల అవసరాలను యంత్రాలే తీర్చే ఒక "సూపర్-సమృద్ధి" భవిష్యత్తును ఆయన ఊహించారు. దీని ద్వారా ప్రజలు శ్రమ లేకుండా జీవించవచ్చు. దీనికోసం మనం పనిని ఎలా నిర్వచిస్తాం, విలువలు, యాజమాన్యం వంటి విషయాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
AI, రోబోటిక్స్, ఆటోమేషన్ అనేవి చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, 2045 నాటికి చాలా మానవ ఉద్యోగాలు పనికిరాకుండా పోతాయని ఆయన హెచ్చరించారు. రాబోయే ఆటోమేషన్ కారణంగా భారీ అసమానతలు వస్తాయని, కొత్త ఆర్థిక నమూనాలను అవలంబించకపోతే చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications