సినిమాలను మించి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ... ఏఐ ఎఫెక్ట్ గురూ!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుంది. పెళ్లిళ్ల సీజన్లో పెళ్లి చేసుకునే వారు ఇటీవల కాలంలో ఫోటోషూట్స్ కు బాగా ప్రాధాన్యతనిస్తున్నారు. వివాహ వేడుకలను అందమైన జ్ఞాపకం లాగా మార్చుకోవడానికి ఫోటోగ్రఫీకి చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాలలో దూసుకుపోతున్న నేటి రోజుల్లో వివాహ ఫోటోగ్రఫీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పూర్తిగా మార్చేస్తోంది.
వివాహ వెడ్డింగ్ షూట్ లకు ఏఐ
ఫోటోగ్రాఫర్లు AIని ఉపయోగించి పెళ్లిలోని అమూల్యమైన క్షణాలను ఎంతో నైపుణ్యంతో, సృజనాత్మకంగా బంధిస్తున్నారు. ఈ సాంకేతికత ఫోటోలను చాలా సమర్థవంతంగా ఎడిట్ చేయడానికి, వాటిని చక్కగా అమర్చడానికి, ఇంకా నాణ్యతను పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఫోటోగ్రాఫర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ఉపయోగించే AI టూల్స్ ముఖ్యమైన సన్నివేశాలను గుర్తించగలవు, దీనివల్ల పెళ్లిలో ఏ ఒక్క ముఖ్యమైన సందర్భం, సన్నివేశం మిస్ కాకుండా ఉంటాయి.

ఉత్తమ ఫోటోలను ఎంపిక చేసి క్రమపద్దతిలో అందించే ఏఐ
AI ఆధారిత సాఫ్ట్‌వేర్ కొన్ని క్షణాల్లోనే వేలాది ఫోటోలను పరిశీలిస్తుంది. లైటింగ్, ఫోటో తీసిన విధానం (కాంపోజిషన్), మరియు వ్యక్తుల భావాలను (ఎక్స్‌ప్రెషన్‌లు) బట్టి ఉత్తమమైన షాట్‌లను ఇది ఎంపిక చేస్తుంది. దీనివల్ల ఫోటోగ్రాఫర్లు స్వయంగా ఫోటోలను ఒక పద్ధతిలో పెట్టడానికి పట్టే సమయం బాగా తగ్గుతుంది. ఫలితంగా, క్లయింట్‌లకు వారి వెడ్డింగ్ ఆల్బమ్‌లు గతంలో కంటే చాలా త్వరగా అందుతాయి.
రంగులను సర్దుబాటు చేయటంలో ఏఐ ఉపయోగం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమయాన్ని వృధా కాకుండా కాపాడటమే కాకుండా, అద్భుతమైన సందర్భాలను, మంచి మంచి ఫోటోలను ఎంపిక చేసి క్రమబద్ధంగా అందిస్తుంది. AI రంగులను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేయడం, అనవసరమైన అంశాలను తొలగించడం ద్వారా ఫొటోలను మరింత అద్భుతంగా, సులువుగా ఎడిట్ చేయడంలో సహాయపడుతుంది. ఇది క్యాండిడ్ షాట్స్ లేదా గ్రూప్ పిక్చర్స్ వంటి కేటగిరీల కింద ఫోటోలను చక్కగా క్రమబద్ధీకరిస్తుంది.
పెళ్లి వేడుకలకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్న ఏఐ
పెళ్లి వేడుకను కూడా ఒక చక్కటి కథలా చెప్పేలా చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అందమైన ఆల్బమ్‌లను రూపొందించడం ఫోటోగ్రాఫర్‌లకు సులభమవుతుంది.అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెళ్లి సమయంలో తీసే ఫోటోలను కూడా రియల్ టైం లో షేర్ చేసే సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. ఇక ఏ ఐ వివాహ వేడుకలకు సంబంధించి కీలకంగా పనిచేస్తూ పెళ్లిళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో పెను మార్పు
ఏఐ వచ్చిన అతిథులను సైతం ఆకట్టుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫోటోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో పెద్ద మార్పును సూచిస్తుంది. ప్రస్తుతం ఇందులో పనిచేసే నిపుణులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి, క్లయింట్ లకు సమయానికి నాణ్యమైన ఫోటోలను అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతున్నారు.
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications