డీప్ ఫేక్ ను మించిన AI ముప్పు..! ఈసారి టార్గెట్ రాజకీయం-తాజా రిపోర్ట్..!

కృత్రిమ మేథ దూకుడుతో ప్రపంచానికి లభిస్తున్న ప్రయోజనం సంగతి డేవుడెరుగు ముప్పు మాత్రం అంతకంంటే వేగంగా పెరిగిపోతోంది. ఇప్పటికే డీప్ ఫేక్ లు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో ఏఐ హల్ చల్ చేస్తుండగా.. ఇప్పుడు ప్రపంచానికి అంతకంటే పెద్ద ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఈసారి ఏకంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను ఆక్రమించి తప్పుడు వాదనలతో ప్రభుత్వాలను కూల్చే ప్రమాదం ఉందని తెలిపింది.

సోషల్ మీడియాతో ప్రజాస్వామ్యంపై దాడి (AI swarms)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆక్రమించి, తప్పుడు కథనాలను వ్యాప్తి చేసి, యూజర్లను వేధించి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం హెచ్చరించింది. ఈ ఏఐ సమూహాలు సమాచార యుద్ధంలో కొత్త ఫ్రంట్‌లో భాగంగా ఏర్పడతాయని, మానవ ప్రవర్తనను అనుకరించగలవని సైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించిన కొత్త పాలసీ ఫోరమ్ పేపర్ తెలిపింది.

AI Swarms Emerge as New Threat to Democracy Experts Warn in Science Study

చౌకగా అబద్ధాల సృష్టి

ఈ ఏఐ ఏజెంట్లు.. పాత ఏఐ బాట్ ల తరహాలో కాకుండా రియల్ టైంలో సమన్వయం చేసుకుంటూ ఇచ్చిన అభిప్రాయానికి అనుగుణంగా మారంతో పాటు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో వేలాది ఖాతాలలో తమ కథనాలను కొనసాగించే ప్రమాదం ఉందని తెలిపింది. జనరేటివ్ టూల్స్ విశ్వసనీయతను త్యాగం చేయకుండా ప్రచార అవుట్‌పుట్‌ను విస్తరించగలవని, మనుషులు రాసిన వాటి కంటే మెరుగైన అబద్ధాలను చౌకగా సృష్టించగలవని హెచ్చరించింది. ఏఐ లాజిక్ మెరుగుపర్చేందుకు వాడే చైన్-ఆఫ్-థాట్ ప్రాంప్టింగ్ వంటి టెక్నాలజీలు.. మరింత నమ్మకంగా తప్పుడు కథనాల తయారీకి వాడే ప్రమాదం ఉందని తెలిపింది.

AI Swarms Emerge as New Threat to Democracy Experts Warn in Science Study

గుర్తించడం కూడా కష్టం

చివరికి వీటిని గుర్తించడం కష్టమవుతుందని పరిశోధకులు చెప్తున్నారు. దీని వలన వాటి విస్తరణ ఎంతవరకు ఉందో తెలియకపోవచ్చన్నారు. అలాంటి పరిస్థితిని నివారించడానికి ఉత్తమ ఎంపికలతో పాటు ఆటోమేటిగ్ అనుమతుల కంటే ఆచరణాత్మక విధానాలపై దృష్టి పెట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు.మోల్ట్‌బుక్ అనే కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రాక నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. ఇక్కడ ఏఐ ఏజెంట్లు మాత్రమే అంశాలను పంచుకుంటారు. వాటిపై చర్చిస్తారు. మనుషులు గమనించడానికి అనుమతిస్తారు కానీ పోస్ట్ చేయరు. ఈ ప్లాట్‌ఫామ్‌ను మాట్ ష్లిచ్ట్ తన ఏఐ అసిస్టెంట్ సాయంతో సృష్టించారు. ఈ ప్లాట్‌ఫామ్ కోసం తాను ఒక్క లైన్ కూడా కోడ్ రాయలేదని ష్లిక్ట్ తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+